Watch Video: అయ్య బాబోయ్.. ఒకేసారి 100 కార్లు ఢీ కొంటే ఎలా ఉంటుంది…? సీసీ కెమెరాలో రికార్డైన సీన్..
ఒకేసారి వందకు పైగా కార్లు ఢీకొనడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం హుటా హుటాన సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు
విపరీతమైన వాతావరణం వల్ల కలిగే ప్రమాదాల గురించి తరచూ వింటుంటాం..సోషల్ మీడియాలో అలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూస్తుంటాం..అయితే, తాజాగా అలాంటి ఘటనే జరిగింది. మంచుతో నిండిన ఎక్స్‌ప్రెస్‌వేలో ఒకేసారి దాదాపుగా 100కు పైగా కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వరుసగా కార్లు ఢీ కొనడంతో ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై అస్తవ్యస్థంగా పడిఉన్న కార్ల దృశ్యం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
చైనాలోని సుజౌ నగరంలోని ఎక్స్‌ప్రెస్ హైవేలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై మంచు నిండిపోవడంతో అదుపుతప్పి దాదాపు 100 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోడ్డు ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారినట్లు అక్కడి మీడియా తెలిపింది. తాజా ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ కార్లన్నీ నుజ్జునుజ్జు అయ్యాయి.
Many vehicles collided due to icy roads on the elevated section of #Xinggang Street in #Suzhou Industrial Park, #China #accident #snowfall #Winters #BREAKING
— Chaudhary Parvez (@ChaudharyParvez) February 23, 2024
ఒకేసారి వందకు పైగా కార్లు ఢీకొనడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం హుటా హుటాన సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రమాదం కారణంగా ఆ రోడ్డుపై కార్లన్నీ చెల్లాచెదురుగా పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..