AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Whitening Tips: నలుగురిలో నవ్వలేకపోతున్నారా..? ఇలా తోమితే మీ పళ్ళు తెల్లగా ఉంటాయట..!..ఈజీ టిప్స్

ముందుగా, తెలుసుకోవాల్సింది.. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. కొందరికి ఎంత శుభ్రం చేసినా పసుపు రంగులోకి మారుతుంది. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కేవలం రెండు మూడు నిమిషాల్లో పసుపు పళ్లను ముత్యల్లా తయారు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా !

Teeth Whitening Tips: నలుగురిలో నవ్వలేకపోతున్నారా..? ఇలా తోమితే మీ పళ్ళు తెల్లగా ఉంటాయట..!..ఈజీ టిప్స్
Teeth Whitening Tips
Jyothi Gadda
|

Updated on: Feb 24, 2024 | 6:44 AM

Share

Teeth Whitening Tips: మీ చిరునవ్వే మీ గుర్తింపు.. కానీ ఈ చిరునవ్వుపై చిన్న మరక కూడా మిమ్మల్నీ నిట్టూర్పుకు గురి చేస్తుంది. అవును మీరు మీ చిరునవ్వును అంటే మీ దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోతే, అది మీకు ఇబ్బందిగా మారుతుంది. దంతాలు చక్కగా తెల్లగా ఉంటేనే శుబ్రంగా ఉంటేనే నలుగురిలో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం.. అలా కాకుండా దంతాలు అపరిశుభ్రంగా, పచ్చగా పాచితో ఉంటే ఎవరు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. అందుకే ఎదుటివారిని ఆకర్షించడంలో దంతాలు చాలా ముఖ్యమైనవి. దంతాలపై గార, పాచి ఉన్నవాళ్ళు రకరకాల పేస్ట్ వాడుతూ ఉంటారు. అయినప్పటికి పెద్దగా మార్పేమి కనిపించదు. కానీ, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యకరమైన మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా !

ముందుగా, తెలుసుకోవాల్సింది.. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. కొందరికి ఎంత శుభ్రం చేసినా పసుపు రంగులోకి మారుతుంది. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కేవలం రెండు మూడు నిమిషాల్లో పసుపు పళ్లను ముత్యల్లా తయారు చేసుకోవచ్చు.

పసుపు దంతాల సమస్యను తగ్గించడంలో నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసం, బేకింగ్ సోడా రెండింటినీ మిక్స్ చేసి దంతాల మీద మసాజ్ చేయాలి. ఆ తరువాత, మీరు మీ నోటిని శుభ్రంగా వాష్‌ చేసుకోండి. ఇలా చేస్తే రెండు నిమిషాల్లోనే మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

పండిన స్ట్రాబెర్రీలతో కూడా పసుపు దంతాలకు మెరుపును తేవచ్చు. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి అందులో టూత్‌బ్రెష్ ముంచి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా రెండు వారాలు చేస్తే దంతాలు మిలమిల మెరుస్తాయి. అయితే దంత నిపుణులు మాత్రం స్ట్రాబెర్రీ పండుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలంటున్నారు. స్ట్రాబెర్రీలలో సిట్రిక్‌ యాసిడ్ ఉండ‌టం వ‌ల్ల దృఢంగా ఉండే దంతాల పైభాగం దెబ్బతినే ప్రమాదం ఉందట.

పసుపు దంతాల సమస్యకు అరటిపండు కూడా పరిష్కారం అవుతుంది. అరటి పండులోఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు దంతాలపై ఉన్న మచ్చలను పోగొడతాయి. బాగా పండిన అరటి పండు తొక్కను తీసుకుని దానికి అంటుకుని ఉండే పదార్థంతో దంతాలను రెండు నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఇలా మూడువారాలు చేసిన తర్వాత దంతాలు తెల్లగా మెరుస్తాయి.

తులసితో కూడా పసుపు పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎండిన తులసి ఆకులను ఆవాల నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దంతాలపై రాయాలి. దీంతో మీ పళ్లు తలతల మెరుస్తాయి. తులసి మౌత్ వాష్ యాంటీప్లాక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనలో చాలా మంది ఇప్పటికీ వేప పుల్లను బ్రష్ గా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..