Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాపం.. పానీపూరీ ప్రియులకు చేదు వార్త..! మీ ప్రయోగాలు ఆపండ్రా బాబు అంటూ నెటిజన్ల ఫైర్..

పానీపూరీ తక్కువ ధరలో లభించే రుచికరమైన ఫుడ్‌ఐటమ్‌గా ప్రసిద్ధి చెంది. అయినప్పటికీ కొందరు పాకశాస్త్ర ప్రవీణ్యులు ఇప్పటికీ దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ బృందం చాక్లెట్ పానీ పూరీ, దోస పానీ పూరీ, మ్యాగీ పానీ పూరీ, ఐస్ క్రీమ్ పానీ పూరీ వంటి అద్భుతమైన వంటకాలను కనిపెట్టింది. ఈ ప్రయోగాలు పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో..ఇప్పుడు కొత్త పదార్థం తెరపైకి వచ్చింది.

Watch Video: పాపం.. పానీపూరీ ప్రియులకు చేదు వార్త..! మీ ప్రయోగాలు ఆపండ్రా బాబు అంటూ నెటిజన్ల ఫైర్..
Panipuri Shawarma
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 23, 2024 | 7:43 PM

‘పానీ పూరీ’ అనే పదం కొందరి నోళ్లలో నీళ్లు ఊరేల చేస్తుంది.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పానీపూరీని ఇష్టపడతారు. పానీపూరీ ఫేమస్‌ స్ట్రీట్‌ఫుడ్‌. ఈరోజుల్లో ఎన్నో కొత్త రకాల పానీపూరీలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రకరకాల రుచుల పానీపూరీలు వచ్చాయి. అయితే క్లాసిక్ పానీ పూరీ మాత్రం భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది తక్కువ ధరలో లభించే రుచికరమైన ఫుడ్‌ఐటమ్‌గా ప్రసిద్ధి చెంది. అయినప్పటికీ కొందరు పాకశాస్త్ర ప్రవీణ్యులు ఇప్పటికీ దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ బృందం చాక్లెట్ పానీ పూరీ, దోస పానీ పూరీ, మ్యాగీ పానీ పూరీ, ఐస్ క్రీమ్ పానీ పూరీ వంటి అద్భుతమైన వంటకాలను కనిపెట్టింది. ఈ ప్రయోగాలు పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో..ఇప్పుడు కొత్త పదార్థం తెరపైకి వచ్చింది. ఈ వంటకాన్ని చికెన్ పానీ పూరీ అంటారు. అంటే కూరగాయలకు బదులుగా చికెన్ లేదా మటన్ వాడతారు. ఇప్పుడు ఈ వంటకాన్ని చూసి, శాకాహారులు పానీ పూరీని ఎలా తింటారు? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఇదే ఆందోళనలో పడ్డారు.

షవర్మా పానీపూరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింత పానీ పూరీని చాలా మంది ఇష్టపడుతుండగా, కొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షవర్మా ఇష్టపడే నాన్-వెజ్ ప్రియుల కోసం, ఈ పానీపూరీని అదే షవర్మాతో తయారు చేస్తారు. మీరు ఈ వీడియోలో చూడగలిగినట్లుగా, వ్యక్తి మొదట చికెన్‌ను కోసి, ఆపై చాలా చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేశాడు. ఆ తర్వాత బీట్‌రూట్‌, క్యాబేజీ, ఉల్లిపాయ వంటివి కట్ చేసి అందులో చట్నీ, మయోనైస్ వేసి కలిపాడు. తర్వాత ఆ మిశ్రమాన్ని పానీ పూరీలో నింపాడు. అలాంటి 5, 6 పూరీలలో షవర్మ మిశ్రమంతో నింపి మళ్లీ దానిపై సాస్, చీజ్ వేసి సిద్ధం చేస్తాడు.

ఇవి కూడా చదవండి

ప్రజలు ఈ వింత ఆహారాల వీడియోలను వివిధ సోషల్ మీడియా సైట్‌లలో షేర్ చేస్తున్నారు. ప్రజలు ఈ వింత ఆహారాలను ఫ్యూజన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇందులో కొన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కానీ కొన్ని చాలా వింతగా ఉండటం కారణంగా..ప్రజలు ఇలాంటివి అస్సలు ఇష్టపడరు. కొత్త ప్రయత్నాల పేరుతో కొందరు ఆ ఆహార పదార్థాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంటారు. అలాంటిదే ఈ వింత ఫుడ్ కాంబినేషన్ మళ్లీ వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..