ఆరోగ్యానికి ఏది మంచిది..? వేడి, చల్లటి అన్నం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వేడి అన్నం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. చల్లటి అన్నం ఆరోగ్యానికి మంచిదని మరి కొందరి నమ్మకం. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ప్రశ్న మరికొందరిలో వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏది మంచిది..? వేడి అన్నం మంచిదా..? చల్లటి అన్నం బెటరా.? ఇక్కడ తెలుసుకుందాం..

ఆరోగ్యానికి ఏది మంచిది..? వేడి, చల్లటి అన్నం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Rice
Follow us

|

Updated on: Feb 23, 2024 | 5:40 PM

భారతదేశ వ్యాప్తంగా దాదాపు అందరూ ఎక్కువగా తినేది అన్నం.. ఇది భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. అందుకే అన్నానికి, రోటీకి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇక్కడ అప్పుడే వండిన తాజా అన్నం తింటే మంచిదని, వేడి అన్నం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. చల్లటి అన్నం ఆరోగ్యానికి మంచిదని మరి కొందరి నమ్మకం. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ప్రశ్న మరికొందరిలో వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏది మంచిది..? వేడి అన్నం మంచిదా..? చల్లటి అన్నం బెటరా.? ఇక్కడ తెలుసుకుందాం..

తాజా అన్నం కంటే చల్లటి అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చల్లని అన్నంలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన పేగు ఆరోగ్యానికి మంచిది. చల్లటి అన్నం తినడం వల్ల జీర్ణాశయంలోని బ్యాక్టీరియా వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా కోల్డ్ రైస్ తినడం వల్ల శరీరంలో తక్కువ క్యాలరీలు శోషించబడతాయి.

అన్నం ఎలా తినాలి..

ఇవి కూడా చదవండి

వేడివేడి అన్నం తినకుండా ఎప్పుడు తిన్నా చల్లారిన తర్వాత తినాలి. అన్నం కాస్త చల్లారాక 5-8 గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా తినడం వల్ల పోషకాలు పెరుగుతాయి.

జీర్ణక్రియకు మంచిది..

బియ్యంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అన్నంలో ఉండే స్టార్చ్ వల్ల జీర్ణ సంబంధమైన సమస్య ఉండదు. దీని వల్ల మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీరంలో శక్తిని కాపాడుతుంది..

అన్నంతో పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్ లభిస్తుంది. ఇది శరీరంలో శక్తిని కాపాడుతుంది. అదే సమయంలో అన్నం కూడా సులభంగా జీర్ణమవుతుంది.

భారంగా అనిపించదు..

చల్లటి అన్నం బరువుగా ఉండదు కాబట్టి అది తిన్నాక కడుపు భారంగా అనిపించదు. ఇది త్వరగా జీర్ణమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?