AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్కార్‌ వారి సరికొత్త పథకం.. ! ఇక్కడ చెట్లకు పెన్షన్‌.. ఎందుకు, ఎంత ఇస్తున్నారో తెలుసా..?

ప్రాణ వాయు దేవతా యోజన కింద హర్యానా ప్రభుత్వం కొన్ని చెట్లకు పెన్షన్ ఇస్తోంది. ఈ సేవ పురాతన చెట్లకు అంటే 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లకు అందుబాటులో ఉంది. ఈ పథకం కింద రావి, మర్రి వంటి పురాతన చెట్లకు వార్షిక పింఛను అందజేస్తారు. ఈ గ్రామాల్లోని చాలా చెట్లు పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఆక్సిజన్ నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తున్న తరుణంలో చెట్లను రక్షించేందుకు ఈ పథకాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు పలువురు విశ్లేషకులు.

సర్కార్‌ వారి సరికొత్త పథకం.. ! ఇక్కడ చెట్లకు పెన్షన్‌.. ఎందుకు, ఎంత ఇస్తున్నారో తెలుసా..?
Pran Vayu Devta Scheme
Jyothi Gadda
|

Updated on: Feb 23, 2024 | 4:16 PM

Share

మన దేశంలో ప్రభుత్వాలు ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకించి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్‌ వంటి పలు రకాల పెన్షన్ సేవలను కూడా అందిస్తుంది. అయితే, ఎక్కడైనా చెట్లకు పింఛన్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా..? అవును చెట్లకు పెన్షన్ అన్న మాట నిజమే..ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ హర్యానా ప్రభుత్వం ప్రాణ వాయు దేవతా యోజన కింద చెట్లకు పెన్షన్ ఇస్తోంది. మన దేశంలో అర్హులైన ప్రజలందరికీ సరైన పింఛను అందుతుందో లేదో తెలీదు.. కానీ ప్రాణ వాయు దేవతా యోజన కింద హర్యానా ప్రభుత్వం కొన్ని చెట్లకు పింఛను ఇస్తున్న మాట వాస్తవమే. పురాతన చెట్లను సంరక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఏ చెట్లకు పెన్షన్ లభిస్తుంది..

ఇలాంటి వినూత్న పథకం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రాణ వాయు దేవతా యోజన కింద హర్యానా ప్రభుత్వం కొన్ని చెట్లకు పెన్షన్ ఇస్తోంది. ఈ సేవ పురాతన చెట్లకు అంటే 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లకు అందుబాటులో ఉంది. ఈ పథకం కింద రావి, మర్రి వంటి పురాతన చెట్లకు వార్షిక పింఛను అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ పథకానికి సంబంధించి ఎంత డబ్బు చెల్లిస్తారు..

పథకంలో భాగంగా, భూమి లేని రైతులను ఎంచుకుంటున్నారు.. వారి ఆదాయాన్ని పెంచడానికి ఈ పథకం ప్రణాళిక చేయబడిందని హర్యానా ప్రభుత్వం చెబుతోంది. ఈ చెట్లను సంరక్షించే రైతులకు ఏడాదికి రూ.2500 పింఛను అందజేస్తారు. దీంతో రైతులకు కొంత మేలు జరుగుతుంది. అంతే కాదు, ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల హర్యానా ప్రజలు చెట్లను నరకడం మానేస్తారని కూడా ప్రభుత్వం నమ్ముతోంది. ఇక్కడి ప్రజలు చెట్లను ఎక్కువగా నరికేస్తుండటంతో.. ఇలాంటి ప్రాజెక్టు ద్వారా చెట్లను కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

చెట్ల సంరక్షణలో కచ్చవా, గోలి గ్రామాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ గ్రామాల్లోని చాలా చెట్లు పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఆక్సిజన్ నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తున్న తరుణంలో చెట్లను రక్షించేందుకు ఈ పథకాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు పలువురు విశ్లేషకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..