Monkey: కోతికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు, వీడియో వైరల్
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురాణ బజార్ లో ఓ వానరం విద్యుత్ స్తంభం కు చిక్కుకొని షాక్ తో మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న ఐక్యత టీమ్ వానరాన్ని అతి కష్టం మీద కిందకు దించి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. విద్యుత్ స్తంభం లో చిక్కుకున్న వానారం కరెంట్ షాక్ తో విలవిలాడుతూ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురాణ బజార్ లో ఓ వానరం విద్యుత్ స్తంభం కు చిక్కుకొని షాక్ తో మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న ఐక్యత టీమ్ వానరాన్ని అతి కష్టం మీద కిందకు దించి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. విద్యుత్ స్తంభం లో చిక్కుకున్న వానారం కరెంట్ షాక్ తో విలవిలాడుతూ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది. విద్యుత్ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు.. కరెంట్ సరఫరా నిలిపి వానరాన్ని కిందికి దించి స్థానికుల సాయంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఐక్యత టీమ్ సభ్యులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐక్యత టీమ్ సభ్యులను అభినందించారు నెటిజన్స్.