- Telugu News Photo Gallery 3 or more cups of coffee,Tea a day may increase kidney dysfunction Telugu Lifestyle News
రోజూ 3కప్పుల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగితే ఏమవుతుందో తెలుసా..? తస్మాత్ జాగ్రత్త..!
భారతదేశంలో అందరూ ఇష్టపడే కెఫిన్ పానీయాలలో కాఫీ, టీలు రెండూ ప్రధానమైనవి. టీ, కాఫీ తాగితేనే కాని కొంతమందికి రోజు ప్రారంభం కాదు. చాలా మంది రోజులో ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగుతుంటారు.. ఇది తమకు హాని కలిగిస్తుందని తెలిసినప్పటికీ ఈ అలవాటును వదిలేయడానికి ఇష్టపడరు. తక్షణ శక్తి కోసం మనం తరచుగా టీ, కాఫీ తాగుతుంటాము. ఇందులో ఉండే కెఫిన్ మెదడుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కానీ ఎక్కువ కెఫిన్ తాగడం వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Feb 23, 2024 | 1:36 PM

డిప్రెషన్: కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీరు డిప్రెషన్‌కు గురవుతారు. మానసిక అనారోగ్యం, డిప్రెషన్, ఒత్తిడితో బాధపడేవారు ఒక కప్పు కాఫీ కాఫీ తాగడం వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. కానీ ఒత్తిడి నుంచి బయటపడటానికి కాఫీ పై ఆధారపడినట్లయితే, కొంత సమయం తర్వాత మళ్లీ ఒత్తిడి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలా కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ రిస్క్ పెరుగుతుంది. ఇది గుండె, శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

మధుమేహం: డయాబెటిక్ పేషెంట్ పొరపాటున కూడా ఎక్కువ కాఫీ తాగకూడదు. ఎందుకంటే అది వారి శరీరంలోని ఇన్సులిన్‌కు భంగం కలిగిస్తుంది. అదనంగా, రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.

నిద్రలేమి: కాఫీ తాగిన తర్వాత చాలా మందికి నిద్ర పట్టదు. అలాంటి వారు కాఫీకి పూర్తిగా దూరంగా ఉండాలి. కాపీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్న ఆరోగ్య నిపుణులు.

కడుపు సమస్యలు: కెఫిన్ ఎక్కువగా తాగడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. చాలా మందికి తరచూగా కడుపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మళ్లీ మళ్లీ బాత్‌రూమ్‌కి పరుగెత్తడం మొదలుపెట్టాడు. డయేరియా వంటి సమస్యలు మొదలవుతాయి.

ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల రొమ్ములో చిన్న చిన్న గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాఫీ వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మనికి, జుట్టుకు మంచిది కాదు. అధిక మోతాదులో కాఫీ తీసుకోవడం వల్ల ఏకాగ్రతను, ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది.

అడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి బీపీని పెంచుతుంది. కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయి. కాఫీ కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాఫీ బీపీని పెంచడమే కాకుండా కొన్ని సార్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కాఫీ తగ్గిస్తుంది.




