- Telugu News Photo Gallery Bad Smell coming from your shoes? Follow these tips, check here is details in Telugu
Tips for Smelly Shoes: మీ షూస్ నుంచి భరించేని దుర్వాసన వస్తుందా.. ఇలా చెక్ పెట్టండి!
ప్రస్తుతం ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ అందరూ అందరూ షూస్‌ని తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. నిజానికి షూస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాళ్లు కూడా పెద్దగా మురికి కావు. కానీ వీటితో వచ్చే చిక్కు ఏంటంటే.. ఒక్కోసారి బాగా దుర్వాసన వస్తుంది. ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కోసారి పక్కన వాళ్లకు కూడా వస్తూ ఉంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా కాకుండా..
Updated on: Feb 23, 2024 | 2:05 PM

ప్రస్తుతం ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ అందరూ అందరూ షూస్‌ని తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. నిజానికి షూస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాళ్లు కూడా పెద్దగా మురికి కావు. కానీ వీటితో వచ్చే చిక్కు ఏంటంటే.. ఒక్కోసారి బాగా దుర్వాసన వస్తుంది.

ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కోసారి పక్కన వాళ్లకు కూడా వస్తూ ఉంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ పాటించండి. షూట్ వాడకం అయిపోయిన తర్వాత ఎప్పుడూ గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి.

తడిగా ఉండే సాక్సులను అస్సలు వేసుకోకూడదు. సాక్సులను ఎప్పటికప్పుడు వెంటనే ఉతికి ఆరేస్తూ ఉండాలి. అదే విధంగా షూస్‌ని కూడా నాలుగు రోజులకు ఓసారి మార్చుతూ ఉండాలి. ఒక్కోసారి షూస్‌కి బదులు సాధారణ చెప్పులను కూడా ఉపయోగిస్తూ ఉండాలి.

షూస్ వాష్ చేసిన తర్వాత ఎండ ఎక్కువగా తగిలేలా చేయాలి. మీ బూట్ల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే నిమ్మ తొక్కను రాత్రిపూట షూస్‌లో వేసి.. ఉదయాన్నే తీసివేయాలి. ఇలా చేస్తే దుర్వాసన రాదు.

అలాగే తడిగా ఉండే షూస్‌లో బేకింగ్ సోడా వేయాలి. ఇది తేమతో పాటు బ్యాక్టీరియా వంటివి కూడా నశిస్తాయి. అప్పుడప్పుడు బేకింగ్ సోడాను కూడా వేస్తూ ఉంటే.. దుర్వాసన రాదు. ఇతర పౌడర్లు వేసినా వాసన రాకుండా ఉంటాయి.




