ఉదయాన్నే మంచి మ్యూజిక్‌ వినటం అలవాటు చేసుకోండి.. పాటలు వింటూ పాడుతూ ఉంటే..!

క్రమం తప్పకుండా సంగీతం వినడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. రోజును ప్రారంభించడానికి ముఖ్యంగా ఉదయాన్నే సంగీతాన్ని ఆస్వాదించండి. అలాగే, నిద్రపోయే ముందు కూడా మంచి సంగీతం మేలు చేస్తుంది. మీ అభిరుచికి అనుగుణంగా సంగీతాన్ని ఎంచుకోవచ్చు. మనస్సు మరింత 'రిలాక్స్'గా మారడంతో సుఖ నిద్రకు దారితీస్తుంది. అంతేకాదు..సంగీతం వినడం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

ఉదయాన్నే మంచి మ్యూజిక్‌ వినటం అలవాటు చేసుకోండి.. పాటలు వింటూ పాడుతూ ఉంటే..!
Listening Music
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 23, 2024 | 2:18 PM

మ్యూజిక్‌ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సంగీతంతో ప్రతి ఒక్కరికి మానసిక అనుబంధం, ప్రేమ ఉంటుంది. సంగీతమంటే మనుషులకు దగ్గరైన కళ అని చెప్పొచ్చు. అలాంటి సంగీతం కూడా ఓ ఔషధం అని అంటారు. అంటే, అనేక ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలకు చికిత్సలో భాగంగా మ్యూజిక్ థెరపీని వాడుతుంటారు. అలాగే, ప్రతి ఒక్కరూ తమ రోజు వారి కార్యకలాపాల్లో సంగీతాన్ని భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత, ఆఫీసుకు, కాలేజీ, స్కూల్‌, కార్యాలయానికి వెళ్లే ముందు లేదా ఇంటిపని చేస్తున్నప్పుడు సంగీతం వినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మంచి సంగీతం మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చాలా మందికి ఉదయం లేవగానే మూడ్‌ ఆఫ్‌గా ఉంటుంది. వీటన్నింటిని మార్చడానికి, ప్రకాశవంతంగా రోజుని ప్రారంభించడానికి సంగీతం సహాయపడుతుంది. సానుకూల పాటలు, అంత సూక్ష్మమైన సంగీతం అన్నీ డోపమైన్ హార్మోన్‌ను పెంచుతాయి. ఈ హార్మోన్ మనలో ఆనందాన్ని నింపుతుంది. కొంతమందికి, ‘ప్రేరణాత్మక’ సంగీతాన్ని వినడం జీవితంలో వారికి మరింత ప్రేరణనిస్తుంది. ఇది కూడా మంచి పద్ధతి. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సంగీతం కూడా గొప్పగా సహాయపడుతుంది. అలాగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. సంగీతం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. సంతోషం హార్మోన్ డోపమైన్‌ను పెంచుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది.

సంగీతాన్ని ఆస్వాదించడం మెదడుకు కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా శ్రద్ధలేకపోవటం రుగ్మత ఉన్నవారికి. సంగీతాన్ని ఆస్వాదించడం అనేది మెదడులో మన దృష్టిని పెంచే రసాయన మార్పులలో భాగం. కీటో అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు.. ఇదో రకమైన ఔషధ థెరఫీ. మ్యూజిక్‌ వినటం దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా సంగీతం వినడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. రోజును ప్రారంభించడానికి ముఖ్యంగా ఉదయాన్నే సంగీతాన్ని ఆస్వాదించండి. అలాగే, నిద్రపోయే ముందు కూడా మంచి సంగీతం మేలు చేస్తుంది. మీ అభిరుచికి అనుగుణంగా సంగీతాన్ని ఎంచుకోవచ్చు. మనస్సు మరింత ‘రిలాక్స్’గా మారడంతో సుఖ నిద్రకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు..సంగీతం వినడం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. సంగీతం బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సంగీతాన్ని ఆస్వాదిస్తూ వర్కవుట్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా సంగీతంతో వర్కవుట్ చేయడం శరీరానికి, మనసుకు రెండింటికీ మేలు చేస్తుంది. ఇది వ్యాయామం సమయంలో ఇబ్బందులను అధిగమించడానికి, వ్యాయామం తర్వాత మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి మీకు సహాయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..