- Telugu News Photo Gallery If you want to lose weight in a short time it is best to do these things, check here is details
Weight Loss Tips: తక్కువ సమయంలోనే బరువు తగ్గాలంటే.. ఈ పనులు చేయడం బెస్ట్!
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. బరువు పెరిగినంతగా బరువు తగ్గడం చాలా కష్టం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఈ బరువును తగ్గించుకోవడానికి ఆ తర్వాత నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ అధిక బరువు వల్ల.. లేని పోని దీర్ఘకాలికి వ్యాధులు కూడా వస్తున్నాయి. మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం..
Updated on: Feb 23, 2024 | 4:25 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. బరువు పెరిగినంతగా బరువు తగ్గడం చాలా కష్టం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఈ బరువును తగ్గించుకోవడానికి ఆ తర్వాత నానా కష్టాలు పడాల్సి వస్తుంది.

ఈ అధిక బరువు వల్ల.. లేని పోని దీర్ఘకాలికి వ్యాధులు కూడా వస్తున్నాయి. మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ఇంట్లోనే మీకు ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయండి. ఇలా చేస్తే బాడీ అంతా కదులి.. కొవ్వు కరుగుతుంది.

ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం మీకు కుదిరిన సమయంలో ఓ అరగంట పాటు వాకింగ్ చేయడం మొదలు పెట్టండి. ఇలా ప్రతి రోజూ చేస్తే వచ్చే ఫలితాన్ని మీరే గనిస్తారు. చిన్న యోగా ఆసనాలను ఇంట్లోనే రోజూ చేస్తే.. క్రమంగా వెయిట్ లాస్ అవుతారు.

బరువు తగ్గాలి అని మీరు అనుకుంటే. ముందుగా లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించాలి. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గడంతో పాటు.. కడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాధులు చాలా వరకూ తగ్గిపోతాయి.

లేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ఇది కడుపులో ప్రేగుల్ని శుభ్రం చేస్తుంది. మలినాలు, వ్యార్థాలు బయటకు వచ్చేస్తాయి. ఇంటిని స్వయంగా మీరే క్లీన్ చేస్తూ ఉండండి. అలాగే జంక్ ఫుడ్‌కి చాలా దూరంగా ఉండండి.




