Viral Video: అమ్మ తల్లి.. నీకో దండం..! ఆమ్లెట్ వేసేందుకు కొత్త టెక్నిక్.. వీడియో చూస్తే గుడ్లు తేలేయాల్సిందే..!
కొందరు ఆమ్లెట్ మధ్యలో విరిగిపోయే సమస్యను ఎదుర్కొంటారు. అంటే, పాన్‌పై వేసిన ఆమ్లెట్‌ను అటు ఇటూ కాల్చేందుకు తిప్పడంలో ఇబ్బంది పడుతుంటారు. అలా తిరగేసే క్రమంలో మధ్యలో విరిగిపోతుంది..దాంతో వారి శ్రమ అంతా వృధాగా అనిపిస్తుంది. ఇది మీకు జరిగిందా? దీనికి పరిష్కారంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
నాన్-వెజ్ వంటకాలలో పెద్దగా మసాలాలు అవసరం లేకుండా త్వరగా, సులభంగా తయారుచేయగలిగేది గుడ్డు ఆమ్లెట్ ఒక్కటే. కొంతమంది ఈ ఆమ్లెట్ వేయటం కూడా కష్టంగానే భావిస్తారు.. కానీ, వాస్తవానికి ఒకటి లేదా రెండు గుడ్లను కొట్టి ఒక్కగిన్నెలోకి తీసుకుని.. ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా చిలకొట్టుకుని వేడి పాన్‌లో దోసెలా పోస్తే సరి.. మసాలా ఆమ్లెట్ అక్షరాలా 5 నిమిషాల్లో తినడానికి సిద్ధంగా ఉంటుంది. కొందరైతే దానికి రకరకాల కూరగాయలు వేసి చక్కగా దిబ్బరొట్టేలా ఆమ్లెట్ చేసి తింటారు. అయితే, అలా చేస్తున్నప్పుడు కొందరు ఆమ్లెట్ మధ్యలో విరిగిపోయే సమస్యను ఎదుర్కొంటారు. అంటే, పాన్‌పై వేసిన ఆమ్లెట్‌ను అటు ఇటూ కాల్చేందుకు తిప్పడంలో ఇబ్బంది పడుతుంటారు. అలా తిరగేసే క్రమంలో మధ్యలో విరిగిపోతుంది..దాంతో వారి శ్రమ అంతా వృధాగా అనిపిస్తుంది. ఇది మీకు జరిగిందా? దీనికి పరిష్కారంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
గుడ్డు ఆమ్లెట్‌ను చాలా సులభంగా, సరళంగా తిప్పడానికి హ్యాక్ చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ఆ హ్యాక్ అవసరం ఏమైనా ఉందా? అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కారణం వీడియోలో ఒక మహిళ ఆమ్లెట్‌ను గ్రిడిల్‌పై తిప్పడానికి తాడును ఉపయోగిస్తుంది. ఆమె ఎలా చేసిందో చేస్తే మీరు కూడా ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు..
View this post on Instagram
వైరల్ వీడియోలో మహిళ ప్లస్ గుర్తుగా పాన్‌పై రెండు తాళ్లను ఉంచింది. దానిపై గుడ్డు మిశ్రమాన్ని యథావిధిగా దోసెలా పోసింది. ఆమ్లెట్ సగం ఉడికిన తర్వాత, పెనం మీద ఉంచిన తాడును రెండు వైపులా పట్టుకుని, ఆమ్లెట్‌ను తాడు సహాయంతో పాన్‌పై ఉల్టాగా తిప్పింది. చివరగా ఆమ్లెట్ రెండు వైపులా పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఇరుక్కున్న తాడును బయటకు తీసేసింది. ఇప్పుడు ఈ హ్యాక్‌ని చూసిన నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. ఈ వీడియోపై వారి స్పందన చూద్దాం.
ఆ తాడులు ఆమ్లెట్‌ను నాలుగు భాగాలుగా కత్తిరించడానికి వేసిందనుకున్నాం.. అని ఒకరు రాయగా, బ్రెడ్ ఆమ్లెట్ కాదు..ఇది థ్రెడ్ ఆమ్లెట్ అని మరొకరు రాశారు. మరొ వినియోగదారు స్పందిస్తూ… నరకంరా బాబు అంటే…. ఈ ట్రిక్ నిజంగా ఉపయోగపడుతుందని ఇంకొకరు చెప్పారు.
ఈ వీడియో @supersreenivas అనే ఖాతా నుండి Instagram లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 48.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..