నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??

నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Feb 23, 2024 | 7:53 PM

రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సమీపంలో మంగళవారం రాత్రి హైడ్రామా జరిగింది. నడి వీధిలో దొంగా పోలీసులు కలబడ్డారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దొంగలను పట్టుకోవాలని పోలీసులు.. పోలీసుల నుంచి తప్పించుకోవాలని దొంగలు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఛేజింగ్ లు, కాల్పులు, వీధి పోరాటం.. ఇలా సినిమాను తలపించే సన్నివేశం చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సమీపంలో మంగళవారం రాత్రి హైడ్రామా జరిగింది. నడి వీధిలో దొంగా పోలీసులు కలబడ్డారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దొంగలను పట్టుకోవాలని పోలీసులు.. పోలీసుల నుంచి తప్పించుకోవాలని దొంగలు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఛేజింగ్ లు, కాల్పులు, వీధి పోరాటం.. ఇలా సినిమాను తలపించే సన్నివేశం చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలలో బంగారం చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగలు హెహజాద్, సాజిద్ రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్నారని సమాచారం అందింది. దీంతో కేరళ నుంచి ఓ టీమ్ అజ్మీర్ కు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలిసి దర్గాలో తనిఖీ చేపట్టింది. అయితే, జనాలు ఎక్కువగా ఉండడంతో పోలీసుల తనిఖీ సందర్భంగా తోపులాట జరిగింది. జనాలు భయంతో పరుగులు పెట్టడంతో దొంగలు కూడా వారిలో కలిసిపోయి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్

బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారంలో నిజమెంత ??

రూ.30 లక్షలకు రూ.3 కోట్లు.. షాకిచ్చిన పోలీసులు

ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందేనా ??

విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??