Walking Benefits: రోజూ వాకింగ్‌తో ఫుల్‌ జోష్‌..! కానీ, ముందు మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.. నిపుణుల సూచన

ఎక్కువగా కాకుండా కొంత నీరు తాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నడవటం శరీరానికి మంచిది. వ్యాయామంతో పాటు మీ ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అధిక కేలరీల ఆహారం తీసుకోకూడదని గుర్తుంచుకోండి. దాంతో పాటు ఎక్కువ కేలరీలు తింటూ తక్కువ వాకింగ్‌ చేయటం వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఆహారం తక్కువ కేలరీలు కలిగి ఉండేలా చూసుకోండి. ఇక ఏ టైమ్‌లో వాకింగ్ చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

Walking Benefits: రోజూ వాకింగ్‌తో ఫుల్‌ జోష్‌..! కానీ, ముందు మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.. నిపుణుల సూచన
Walking Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 24, 2024 | 7:19 AM

Walking Time: వాకింగ్‌ అందరూ ఇష్టంగా చేసే ఈజీ వ్యాయామం.. ఎందుకంటే ఇది బరువు తగ్గడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది. నడక మనల్ని శక్తివంతం చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. వాకింగ్‌ అనేది ఈజీ ఎక్సర్‌సైజ్‌ మాత్రమే కాదు.. మీ సౌలభ్యం ప్రకారం మీరు దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం రోజులో ఏ సమయంలో వాకింగ్‌ చేస్తే మంచిది.. ఎప్పుడు నడిస్తే..మరింత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఏ టైమ్‌లో వాకింగ్ చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

రోజులో ఏ టైమ్‌లో వాకింగ్‌ చేస్తే ప్రయోజనకరం..?

ఒక అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గడానికి వాకింగ్‌ చాలా ప్రభావవంతమైన పరిష్కారం అని చెప్పింది. నడవడానికి ఉత్తమ సమయం ఏది అని కూడా ఆ అధ్యయనంలో వివరించారు. ఈ అధ్యయనాన్ని విశ్వసిస్తే, ఉదయం 7 నుండి 9 వరకు నడవడానికి ఉత్తమ సమయంగా వెల్లడించారు.. కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఉదయం నడవలేకపోతే సాయంత్రం కూడా వాకింగ్‌కు వెళ్లవచ్చు అని కూడా స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

వాకింగ్‌ ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వాకింగ్‌ చేసేవారు ఒక గంటలోపు మూడు కిలోమీటర్ల కంటే తక్కువ నడిస్తే దానిని నార్మల్ వాక్ అంటారు. దీనికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు నేరుగా నడవవచ్చు. ఒక వేళ గంటకు 6 కిలోమీటర్లు నడిస్తే దానిని మోడరేట్ వాక్ అంటారు. దీనిని ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా కొంత వ్యాయామం చేయడం అవసరం. ఇక జాగింగ్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అదే విధంగా ముగించిన తర్వాత కొన్ని వార్మప్​లు చేయాలి. ఏదైనా వ్యాధి వల్ల ఇబ్బంది పడేవారు అతిగా నడవటం అంత మంచిది కాదు. శరీరానికి ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా అవసరమైన మేర నడవటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. నడిచేటప్పుడు తప్పనిసరిగా ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఎక్కువగా కాకుండా కొంత నీరు తాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నడవటం శరీరానికి మంచిది. వ్యాయామంతో పాటు మీ ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అధిక కేలరీల ఆహారం తీసుకోకూడదని గుర్తుంచుకోండి. దాంతో పాటు ఎక్కువ కేలరీలు తింటూ తక్కువ వాకింగ్‌ చేయటం వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఆహారం తక్కువ కేలరీలు కలిగి ఉండేలా చూసుకోండి.

ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

– వాకింగ్‌తో శరీరంలో ఫీల్ గుడ్ ఎండార్పిన్లు విడుదలవుతాయి. దాని ద్వారా మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

– బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందుతున్న వారికి వాకింగ్‌ మంచి వ్యాయామం అవుతుంది. నడక ఊబకాయాన్ని నివారిస్తుంది.

– ఇది రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

– డయాబెటిక్ రోగులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. నడవడం వల్ల వారి బరువు తగ్గడమే కాకుండా షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.

– మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడే జీర్ణవ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది.

– ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. నిద్ర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

– శరీరానికి చెమట పట్టేలా నడవటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

– క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

– నడిచే సమయంలో మనం గాలిని ఎక్కువగా తీసుకుంటాం. దాని ద్వారా శరీరంలో అనేక జబ్బులకు కారణమయ్యే కొవ్వు బాగా కరుగుతుంది.

– ప్రతిరోజు కాసేపు వాకింగ్ చేయడం వల్ల కలిగే ఎముకలు గట్టి పడతాయి. కండర శక్తి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..