Bald Hair: అయ్యో పాపం.. మగవారికే బట్టతల ఎక్కువ.. ! ఆడవారికి ఎందుకు రాదో తెలుసా..?

దాంతో జుట్టు రాలిపోతుంది. పైగా ఆ స్థానంలో కొత్త జుట్టు మొలిచే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. అలా పురుషులలో బట్టతల ఏర్పడుతుందంట. అయితే ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆడవాళ్లలో బట్టతల ఎక్కువగా ఉండదు. చాలా అరుదు.

Bald Hair: అయ్యో పాపం.. మగవారికే బట్టతల ఎక్కువ.. ! ఆడవారికి ఎందుకు రాదో తెలుసా..?
Bald Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 24, 2024 | 10:18 AM

నేటి బిజిలైఫ్‌, అనారోగ్యకర ఆహారాలు మన ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా ఉబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే, చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవటం, జుట్టు రాలిపోవటం వంటి సమస్యలు మరి ముఖ్యంగా ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. నేటి రోజుల్లో బట్టతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా ఈ బట్టతల సమస్యతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి పది మందిలో దాదాపు నలుగురు మగవారు బట్టతలతో భాదపడుతునట్లు సర్వేలు చెబుతున్నాయి. మరి పురుషులకే ఎక్కువగా బట్టతల ఎందుకు వస్తుంది ? పురుషులతో పోల్చితే మహిళల్లో బట్టతల శాతం తక్కువ ఉండటానికి కారణం ఏంటి..? అన్నది ఇక్కడ తెలుసుకుందాం..

పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి చాలానే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి ముఖ్యకారణం టెస్టోస్టెరీన్ అంట. దీని వల్లే మగవారికి బట్టతల వస్తుంది అంటున్నారు నిపుణులు. టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగినప్పుడు అడ్రినల్ గ్రంథులు యాండ్రోజనిక్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బ తినడంతో పాటు కృశించుకుపోతాయి. దాంతో జుట్టు రాలిపోతుంది. పైగా ఆ స్థానంలో కొత్త జుట్టు మొలిచే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. అలా పురుషులలో బట్టతల ఏర్పడుతుందంట. అయితే ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆడవాళ్లలో బట్టతల ఎక్కువగా ఉండదు. చాలా అరుదు.

కాబట్టి బట్టతల వచ్చిన తర్వాత బాధ పడడం కంటే రాక మునుపే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి వాటికి దూరంగా ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జుట్టు సంరక్షణకు దోహదం చేసే ఆకు కూరలు, పండ్లు, చేపలు.. వంటి పౌష్టికాహారాన్ని ఆహార డైట్ లో చేర్చుకోవాలి. జుట్టు వేగంగా ఎక్కువగా రాలిపోతుంటే.. హెయిర్ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..