Watch Video: 14 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. రెండు అపార్ట్‌మెంట్లు దగ్ధం.. హాహాకారాలు చేస్తున్న జనం

ఈ ఘటనలో భవనం పూర్తిగా మంటల్లో దగ్థమైనట్టుగా తెలుస్తుంది. మంట‌లు అంటుకున్న బిల్డింగ్‌లో 138 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 450 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాదంలో ఆరుగురు అగ్నిమాప‌క సిబ్బందితో పాటు మొత్తం 15 మంది గాయ‌ప‌డ్డారు. అయితే వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన 20 మంది కోసం గాలిస్తున్నామని..

Watch Video: 14 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. రెండు అపార్ట్‌మెంట్లు దగ్ధం.. హాహాకారాలు చేస్తున్న జనం
Spain Fire News
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 24, 2024 | 11:24 AM

స్పెయిన్‌లోని వాలెన్సియాలో 14 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టుగా తెలిసింది. మరో 20 మంది గల్లంతయ్యారు.. వారందరి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. నివేదికల ప్రకారం, గురువారం సాయంత్రం 5.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దాదాపు 350 మంది భవనంలో చిక్కుకుపోయారు. మంటల నుండి తప్పించుకోవడానికి చాలా మంది అనేక అంతస్తుల నుండి దూకారు. ఈ క్రమంలో భవనం కింద నెట్‌లను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే టవర్ అంతటా మంటలు వ్యాపించినట్టుగా సమాచారం. ఆ బిల్డింగ్ నుంచి మ‌రో బిల్డింగ్‌కు మంట‌లు వ్యాపించాయి. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బహుళ అంతస్తుల నుండి కిందకు దూకడం కనిపించింది. అతనిని రక్షించడానికి, కింత కొందరు మ్యాట్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు భవనంలోని ఇళ్లలో ఉంటున్న చాలా మంది వ్యక్తులు తమ ఫ్లాట్ బాల్కనీ నుండి సహాయం కోసం అర్ధించటం కనిపించింది. దాదాపు 20 మంది అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల్ని ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. బ‌ల‌మైన గాలుల వ‌ల్ల మంట‌లు మరింత పెరుగుతున్నాయి.. క్రేన్ల ఆధారంగా ఫైర్‌ఫైట‌ర్లు స్థానికుల్ని ర‌క్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో భవనం పూర్తిగా మంటల్లో దగ్థమైనట్టుగా తెలుస్తుంది. మంట‌లు అంటుకున్న బిల్డింగ్‌లో 138 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 450 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాదంలో ఆరుగురు అగ్నిమాప‌క సిబ్బందితో పాటు మొత్తం 15 మంది గాయ‌ప‌డ్డారు. అయితే వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన 20 మంది కోసం గాలిస్తున్నామని వాలెన్సియా మేయ‌ర్ మారియా జోస్ క‌ట‌లా తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..