AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇడ్లీ- రాజ్మా ఇంత డేంజరా..? ఆలూ పరాటా, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ మంచిదా..! కొత్త పరిశోధనలో నమ్మలేని నిజాలు..

ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై జరిపిన పరిశోధనలో25 భారతీయ వంటకాలు జీవ వైవిధ్యానికి ముపు కలిగించేవిగా పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వీరు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనలో పలు షాకింగ్‌ విషయాలను కనుగొన్నారు. ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో..

వామ్మో.. ఇడ్లీ- రాజ్మా ఇంత డేంజరా..? ఆలూ పరాటా, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ మంచిదా..! కొత్త పరిశోధనలో నమ్మలేని నిజాలు..
Idli Rajma
Jyothi Gadda
|

Updated on: Feb 24, 2024 | 12:08 PM

Share

భారతదేశంలోని ఇడ్లీ, చనా మసాలా, రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి వడ సహా పలు ఆహారాలు జీవవైవిధ్యానికి అత్యంత హాని కలిగించేవిగా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై జరిపిన పరిశోధనలో25 భారతీయ వంటకాలు జీవ వైవిధ్యానికి ముపు కలిగించేవిగా పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వీరు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనలో పలు షాకింగ్‌ విషయాలను కనుగొన్నారు. ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని వారు వెల్లడించారు. వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయ చరాలపై పడే ప్రభావంపై పరిశోధకులు అంచనా వేశారు.

బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవ వైవిధ్యానికి అధిక ముప్పని పరిశోధనలో తేల్చారు. భారత్‌లో బియ్యం, పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని, దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు వివరించారు. భారతదేశంలో జీవవైవిధ్యంపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు వెల్లడించారు. పరిశోధనకు నాయకత్వం వహించిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, భారతదేశంలో బియ్యం, బీన్స్ వంటివి అధిక ప్రభావం కలిగి ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయన వివరాలు సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిస్సా చెంగ్ అండ్ కొలీగ్స్ నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ (పీఎల్‌వోఎస్)లో ప్రచురితమైంది. అయితే, ఆశ్ఛర్యకరంగా శాకాహారులు, శాకాహార వంటకాలు.. మాంసాహార వంటకాలతో పోలిస్తే తక్కువ జీవ వైవిధ్య ఫుట్‌ప్రింట్స్ కలిగి ఉండడం గమనార్హం. ఈ జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ అయిన ‘లెచాజో’ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉంది. ఈ జాబితాలో ఇడ్లీ ఆరోస్థానంలో ఉండగా రాజ్మా కూర ఏడో స్థానంలో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..