Medaram Jatara: సాయంత్రం జనం నుంచి వనంలోకి సమ్మక్క, సారలమ్మలు.. వన ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్న మంత్రి సీతక్క..
ఈ రోజు సాయంత్రం వన ప్రవేశంతో జాతర ముగియనున్న నేపథ్యంలో మరో 20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. అడవి బిడ్డల జాతరలో అన్నీ తానై నిర్వహించిన మంత్రి సీతక్క జాతర సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. చివరిరోజు సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో వనాలను వీడి జనాల మధ్యకు వచ్చిన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. నేడు జాతరలో నాలుగో రోజు.. గత మూడు రోజులుగా భక్తులతో పూజలను అందుకుంటున్న వనదేవతలు నేడు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశ కార్యక్రమం తో మేడారం మహా జాతర ముగియనుంది. అయితే గత మూడు రోజుల జాతరలో కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. అంతేకాదు జాతరకు ముందు 50 లక్షల మంది దర్శించుకున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ రోజు సాయంత్రం వన ప్రవేశంతో జాతర ముగియనున్న నేపథ్యంలో మరో 20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. అడవి బిడ్డల జాతరలో అన్నీ తానై నిర్వహించిన మంత్రి సీతక్క జాతర సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. చివరిరోజు సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అయితే నేటితో జాతర ముగియనున్న నేపథ్యంలో అన్ని దారులు మేడారంవేపే అన్న చందంగా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జాతరలో చివరి రోజు శనివారం వీకెండ్ రావడంతో రాత్రి భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి బయలు దేరారు. దీంతో రాత్రి కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సకాలంలో స్పందించి పరిస్థితిని చక్కద్దారని పేర్కొన్నారు. అంతేకాదు అమ్మల ఆశీస్సులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాతర సక్సెస్ అవ్వడం సంతృప్తినిచ్చిందని చెప్పారు మంత్రి సీతక్క.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..