Draksharama: ఘనంగా మాణిక్యాంబభీమేశ్వర స్వామి కళ్యాణం.. రథోత్సవం.. రథాన్ని లాగేందుకు పోటీపడిన భక్తులు
భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ వార్ల ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించిన రథంపై ఉంచి పలు గ్రామాల్లో ఊరేగించారు. ద్రాక్షారామంతో పాటు, వెలం పాలెం, అన్నాయిపేట గ్రామాల మీదుగా.. వేగాయమ్మ పేట గ్రామంలోని ఆస్థాన మండపం వరకు రథోత్సవం సాగింది. స్వామివారి ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి రథాన్ని లాగేందుకు.. భక్తులు భారీగా వచ్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు పుట్టినిల్లు.. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. భీమేశ్వరుని రథోత్సవం కన్నుల పండువగా సాగింది. భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ వార్ల ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించిన రథంపై ఉంచి పలు గ్రామాల్లో ఊరేగించారు. ద్రాక్షారామంతో పాటు, వెలం పాలెం, అన్నాయిపేట గ్రామాల మీదుగా.. వేగాయమ్మ పేట గ్రామంలోని ఆస్థాన మండపం వరకు రథోత్సవం సాగింది.
స్వామివారి ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి రథాన్ని లాగేందుకు.. భక్తులు భారీగా వచ్చారు. రథోత్సవంలో భీమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా.. పూల వర్షం కురిపించారు. పూజారులు భక్తులకు స్వామివారి ప్రసాదం అందించారు. రథోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..