AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారా.. గోవాలోని ఈ బీచ్‌లు బెస్ట్ ఎంపిక..

ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ పాపులర్ గా మారింది. ఇందులో భాగంగా పెళ్లిని జరుపుకునేందుకు ఊరికి దూరంగా ఉన్న ఓ ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేస్తారు. వధూవరుల సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరవుతారు. ప్రస్తుతం తమకు అత్యంత ఇష్టమైన కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఈ తరహా వివాహం చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంతే కాదు వధూవరుల కుటుంబ సభ్యులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఆస్వాదిస్తున్నారు. 

Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారా.. గోవాలోని ఈ బీచ్‌లు బెస్ట్ ఎంపిక..
Goa Destination Wedding
Surya Kala
|

Updated on: Feb 24, 2024 | 12:16 PM

Share

ప్రస్తుతం పెళ్లి వేడుకను బిన్నంగా జరుపుకోవాలని.. జీవితంలో సరికొత్త పుటలను అందంగా మొదలు పెట్టాలని భావిస్తున్న యువతి యువకులు భావిస్తున్నారు. అందుకనే పెళ్లి కోసం పెట్టె ఖర్చు విషయంలో రాజీ పడడం లేదు. ఎంత ఖర్చు అయినా సరే చేయడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ పాపులర్ గా మారింది. ఇందులో భాగంగా పెళ్లిని జరుపుకునేందుకు ఊరికి దూరంగా ఉన్న ఓ ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేస్తారు. వధూవరుల సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరవుతారు. ప్రస్తుతం తమకు అత్యంత ఇష్టమైన కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఈ తరహా వివాహం చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంతే కాదు వధూవరుల కుటుంబ సభ్యులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఆస్వాదిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీలను చూసి చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.  ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి కోసం గోవా వెళ్లారు. గోవాలోని బీచ్‌లో ప్రేమికులు దంపతులుగా మారే సమయంలో చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా పెళ్లి అనే ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే గోవాలోని కొన్ని బీచ్‌ల గురించి తెలుసుకుందాం.. ఇక్కడ మీరు మీ కలల వివాహాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

మాండ్రేమ్ బీచ్ (మాండ్రేమ్ బీచ్, గోవా): ఈ బీచ్‌లో పెళ్లివేడుక అందంగా జరుపుకోవచ్చు. మాండ్రేమ్ బీచ్ లో  చాలా అందమైన రిసార్ట్‌లను చూడవచ్చు. వివాహ ఫంక్షన్ కోసం మాండ్రెమ్ బీచ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ బీచ్ నుంచి సూర్యాస్తమ సమయాన్ని ఎంజాయ్ చేయడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సమయంలో  క్లిక్ చేసిన ఉత్తమ ఫోటోలతో పాటు.. వివాహానికి సంబంధించిన సప్తపది కూడా ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఫోటోల పరంగా ఇది గోవాలోని అత్యంత అద్భుతమైన బీచ్‌లలో ఒకటి. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఇక్కడ రకరకాల రిసార్ట్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాండోలిమ్ బీచ్(కండోలిమ్ బీచ్, గోవా): గోవాలోని ఈ బీచ్ చాలా శృంగారభరితంగా పరిగణించబడుతుంది.  ఇది జంటలతో నిండి ఉంటుంది. ప్రేమ పక్షులతో బాగా ప్రాచుర్యం పొందింది. పెళ్లి ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి నగర సందడి నుండి దూరంగా ఉండే కాండోలిమ్ బీచ్‌ని ఎంచుకోవచ్చు. ఇక్కడ  స్వచ్ఛమైన ఇసుక దిబ్బలను ఆస్వాదించవచ్చు.

అంజునా బీచ్: పెళ్లిలోని అందాన్ని ప్రకృతి నడుమ ఆస్వాదించాలనుకుంటే అంజునా బీచ్ ఎంపిక సరైనది. ఈ బీచ్ అరేబియా సముద్రం తీరంలో జరిగే వివాహాలలో అందమైన ఫోటోలకు ప్రసిద్ధి చెందింది. అంజునా బీచ్‌లో ఉన్న రాళ్ళు ఈ బీచ్‌ను మరింత అందాన్ని తీసుకుని వచ్చాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..