Rose Water For Hair: జుట్టు మృదువుగా, మెరిసేలా చేసుకోవడానికి రోజ్ వాటర్‌ని వీటితో కలిపి అప్లై చేయండి..

రోజ్ వాటర్‌ను రోజూ అప్లై చేయడం వల్ల తల వేడి తగ్గుతుంది. తేమగా ఉంటుంది. అంతే కాదు ఇది మీ జుట్టుకు పుష్కలమైన పోషణను అందిస్తుంది. రోజ్ వాటర్‌తో జుట్టుని మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది. సహజంగా జుట్టు మెరుపును పెంచుకోవడానికి కలబంద జెల్‌తో రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది.

Rose Water For Hair: జుట్టు మృదువుగా, మెరిసేలా చేసుకోవడానికి రోజ్ వాటర్‌ని వీటితో కలిపి అప్లై చేయండి..
Rose Water Benefits For Hair
Follow us

|

Updated on: Feb 24, 2024 | 12:44 PM

రోజ్ వాటర్ కేవలం చర్మ సంరక్షణకే కాదు జుట్టు అందాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ ను ప్రతిరోజూ జుట్టుకు రాసుకుంటే.. జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు  మెరుపును పెంచుకోవడానికి పని చేస్తుంది. రోజ్ వాటర్‌ను రోజూ అప్లై చేయడం వల్ల తల వేడి తగ్గుతుంది. తేమగా ఉంటుంది. అంతే కాదు ఇది మీ జుట్టుకు పుష్కలమైన పోషణను అందిస్తుంది. రోజ్ వాటర్‌తో జుట్టుని మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది.

రోజ్ వాటర్ ను జుట్టుకు ఎలా అప్లై చేయాలంటే

సహజంగా జుట్టు మెరుపును పెంచుకోవడానికి కలబంద జెల్‌తో రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. రోజ్ వాటర్..  అలోవెరా జెల్ మిశ్రమాన్ని కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు చాలా కాలం పాటు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

ఎలా మిశ్రమం తయారు చేసుకోవాలంటే

దీని కోసం ముందుగా ఒక గిన్నెలో తాజా అలోవెరా జెల్ ను తీసుకుని అందులో ఐదు చెంచాల రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని మీ తలకు అప్లై చేసి 2 గంటల పాటు అలాగే ఉంచండి. దీని తరువాత  తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వలన జుట్టు మృదువుగా మారుతుంది. అంతేకాదు జుట్టు చివర్లు చిట్లి పోయే సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మిట్టితో రోజ్ వాటర్ అప్లై

జుట్టు పెరుగుదల, ఆరోగ్యకరమైన జుట్టుకు సెబమ్ అవసరం. రోజ్ వాటర్, ముల్తానీ మిట్టిని అప్లై చేయడం ద్వారా సెబమ్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. వేసవిలో చెమట వల్ల జుట్టు తరచుగా జిగటగా మారుతుంది. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఈ మిశ్రమం తయారు చేసుకోవాలంటే

ఈ పేస్ట్ చేయడానికి ముందుగా 1 నుండి 2 స్పూన్ల ముల్తానీ మిట్టిని ఒక గిన్నెలోకి తీసుకోండి లేదా మీ జుట్టు పొడవు ప్రకారం ఇప్పుడు అందులో రోజ్ వాటర్ కలపండి.పేస్ట్‌ను సిద్ధం చేయండి. పేస్ట్‌ ని కొంచెం గట్టిగా కలుపుకోండి. లేకుంటే దీనిని అప్లై చేసేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కొంటారు. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను జుట్టుకు పట్టించి.. ఆరిన తర్వాత షాంపూ ఉపయోగించకుండా జుట్టును కడగాలి. ఆరోగ్యకరమైన,  మెరిసే జుట్టు కోసం ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..