Snake Bite: రూ. కోటి కోసం మనవడి దుర్మార్గం… అమ్మమ్మను పాముతో కాటు వేయించి హత్య!
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే ధనవంతుడు కావాలనే దుర్భుద్ధితో ఓ వ్యక్తి పక్కా ప్లాన్‌తో తన అమ్మమ్మను దారుణంగా హతమార్చాడు. బాందే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పఖంజూర్‌కి చెందిన రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు ఆకాశ్ రూ.కోటి బీమా పాలసీ చేయించాడు..
కంకేర్, ఫిబ్రవరి 25: ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే ధనవంతుడు కావాలనే దుర్భుద్ధితో ఓ వ్యక్తి పక్కా ప్లాన్‌తో తన అమ్మమ్మను దారుణంగా హతమార్చాడు. బాందే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పఖంజూర్‌కి చెందిన రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు ఆకాశ్ రూ.కోటి బీమా పాలసీ చేయించాడు. ఈ మొత్తం పాలసీ సొమ్మును ఎలాగైనా కాజేయాలని ఆకాశ్ కుట్ర పన్నాడు. దీంతో అమ్మమ్మను హతమార్చేందుకు రూ.30 డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం అమ్మమ్మను పాముతో కాటు వేయించి చంపాడు. అనంతరం బీమా ఏజెంట్‌ను కలిసి డెత్ క్లెయిమ్ కింద రూ.కోటి తీసుకున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ ఆమెది సాధారణ మరణంగా అనే అనుకున్నారు. కానీ విచారణలో అది హత్యగా తేలడంతో మనవడు ఆకాశ్ కటకటాలపాలయ్యాడు. 8 నెలల క్రితం జరిగిన ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు ఇన్సూరెన్స్ ఏజెంట్, పాము పురమాయించిన వ్యక్తిని కూడా పఖంజూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలు కథ ఇదే..
నిందితులు మనవడు ఆకాష్ పఠారియా, బీమా ఏజెంట్ తారక్ దేవనాథ్ కలిసి హత్యకు పథకం రచించారని పోలీసు అధికారులు తెలిపారు. బండే పోలీస్ స్టేషన్ పరిధిలోని బండే బస్తీకి చెందిన ఆకాష్ పఠారియా, ఏజెంట్ తారక్ దేవ్‌నాథ్‌తో కలిసి 22 డిసెంబర్ 2022న తన అమ్మమ్మ రాణి పఠారియా పేరు మీద డెత్ పాలసీ తీసుకున్నారు. మొదట రూ. 50 లక్షల బీమా చేశాడు. దీనికి ఏటా రూ. 3 లక్షల ప్రీమియం చెల్లించాలి. ఈలోపు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ కంపెనీ కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్‌కట్‌లో ఆ మొత్తం సొమ్మును కాజేయాలని కుట్రపన్నిన ఆకాశ్ అమ్మమ్మ హత్యకు పథకం రచించాడు. పాలసీ తీసుకున్న నెలరోజుల తర్వాత ఆమెను చంపేందుకు కుట్రపన్నాడు. తొలుత విషపూరిత పాముతో కాటువేయించి చంపి, యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని అనుకున్నాడు. పథకంలో భాగంగా మనవడు ఆకాశ్ పాము యజమాని పప్పు రాం నేతమ్‌కి రూ.30 వేలు సుపారీ ఇచ్చి, పాముతో కాటు వేయించి చంపమని కోరాడు. ఆమె మరణించిన తర్వాత దానిని యాక్సిడెంట్‌గా మార్చే బాధ్యతను నాగరాజుకు అప్పగించాడు.
అకాశ్ అద్దెకు తీసుకున్న కారును బుక్ చేసి, 2 మే 2023 మధ్య రాత్రి సంబల్‌పూర్‌లోని స్నేక్‌చామర్స్ క్యాంపులో అమ్మమ్మ రాణి పఠారియా పాము కాటుకు గురైన తర్వాత ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చి, పాము కాటు కారణంగా తన అమ్మమ్మ చనిపోయిందని అందరినీ నమ్మించాడు. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత నిందితుడు ఏజెంట్ తారక్ దేవ్‌నాథ్ క్లెయిమ్ పేపర్‌లను సిద్ధం చేయించాడు. నవంబర్ 15, 2023న క్లెయిమ్ చేసి రూ. 1 కోటి 02 లక్షలు అందుకున్నాడు. ఆకాశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన నిందితుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసుల అదుపులో ఉన్నారు. ఆకాష్ పఠారియా, తారక్ దేవ్‌నాథ్, పప్పు రామ్ నేతమ్‌లపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి బ్యాంకు పాస్ బుక్, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, పాలసీ పేపర్లు, నగలు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనం, మోటార్ సైకిల్, రూ.10 లక్షల నగదు, రెండు పాములు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.