AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Exam: నేటి నుంచి ఏపీ టెట్‌ 2024 పరీక్షలు.. 120 సెంటర్లలో ఆన్‌లైన్‌ మోడ్‌లో ఎగ్జామ్స్‌

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) - 2024 పరీక్ష మంగళవారం (ఫిబ్రవరి 27) నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 2,67,559 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యా శాఖ హాల్‌ టికెట్లు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు రోజుకు రెండు సెషన్లు చొప్పున టెట్‌ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్ష మొదటి సెషన్‌..

AP TET 2024 Exam: నేటి నుంచి ఏపీ టెట్‌ 2024 పరీక్షలు.. 120 సెంటర్లలో ఆన్‌లైన్‌ మోడ్‌లో ఎగ్జామ్స్‌
AP TET 2024
Srilakshmi C
|

Updated on: Feb 27, 2024 | 7:04 AM

Share

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) – 2024 పరీక్ష మంగళవారం (ఫిబ్రవరి 27) నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 2,67,559 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యా శాఖ హాల్‌ టికెట్లు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు రోజుకు రెండు సెషన్లు చొప్పున టెట్‌ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్ష మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లలో టెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఆయా సెంటర్లలో అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్టు కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని నియమించినట్లు తెలిపారు. 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. వైకల్యం కలిగిన అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి 50 నిమిషాల అదనపు సమయం కేటాయించినట్లు తెలిరు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు మాత్రమే టెట్‌ రాయాల్సి ఉంటుంది. ఇతర సందేహాలు నివృతి కోసం టెట్‌ జరిగే అన్ని రోజుల్లో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు 95056 191­27, 97056 55349, 81219 47387, 81250 469­97 నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చని వెల్లడించారు.

ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉంటాయంటే..

కాగా పేపర్‌ 1ఏ టెట్‌ పరీక్ష నేటి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. పేపర్‌ 2ఏ టెట్‌ మార్చి 2, 3, 4, 6 తేదీల్లో ఉంటుంది. పేపర్‌ 1బి పరీక్ష మార్చి 5వ తేదీన ఉదయం ఉంటుంది. పేపర్‌ 2బి పరీక్ష అదే రోజు మధ్యాహ్నం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.