Telangana: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇంట్లో ఉరివేసుకుని పదో తరగతి విద్యార్ధిని సూసైడ్‌! కారణం ఇదే..

రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి చదుతువుతోన్న విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన శుక్రవారం (ఫిబ్రవరి 23) రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...

Telangana: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇంట్లో ఉరివేసుకుని పదో తరగతి విద్యార్ధిని సూసైడ్‌! కారణం ఇదే..
10th Class Student Committed Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2024 | 7:40 AM

యాచారం, ఫిబ్రవరి 25: రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి చదుతువుతోన్న విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన శుక్రవారం (ఫిబ్రవరి 23) రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కుమార్తె నవ్య (14). కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట ఉన్నత పాఠశాలలో నవ్య పదోతరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సహ విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్‌ తనను ప్రేమించాలంటే నవ్యను గత కొద్దికాలంగా వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు నందీశ్వర్‌ను హెచ్చరించారు. కొద్ది రోజులు సవ్యంగానే ఉన్నా ఆ తర్వాత మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు. బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసికంగా వేదించసాగాడు. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్‌లోనూ నవ్యను వేధించసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటిక వచ్చాక.. ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి ఉరి కొయ్యకు కుమార్తె వేలాడుతూ కనిపించింది.

నవ్య మృతితో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.