AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ‘శరీర నిర్మాణానికి జింక్‌ చాలా అవసరం..’ ఎవరో చెప్పారని ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి! ఎక్స్‌రే చూసి డాక్టర్లు పరేషాన్‌

జింక్‌ అనే ఖనిజం మానవ శరీరంలో చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడటంలో దీనిపాత్ర కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఓ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తికి ఎవరో చెప్పారు. శరీర నిర్మాణంలో జింక్‌ ఉపయోగపడుతుందని చెప్పడంతో అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా..

Delhi: 'శరీర నిర్మాణానికి జింక్‌ చాలా అవసరం..' ఎవరో చెప్పారని ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి! ఎక్స్‌రే చూసి డాక్టర్లు పరేషాన్‌
Man Swallows Coins
Srilakshmi C
|

Updated on: Feb 27, 2024 | 9:58 AM

Share

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జింక్‌ అనే ఖనిజం మానవ శరీరంలో చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడటంలో దీనిపాత్ర కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఓ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తికి ఎవరో చెప్పారు. శరీర నిర్మాణంలో జింక్‌ ఉపయోగపడుతుందని చెప్పడంతో అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా భారీ మొత్తంలో రాగి నాణేలు, అయస్కాంతాలు మింగేశాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రోగికి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని చోటు చేసుకుంది.

ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న స్కిజోఫ్రెనియా అనే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి (26)ని కొందరు వ్యక్తులు తీసుకొచ్చారు. 20 రోజులకు పైగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నాడని బంధువులు చెప్పడంతో.. వైద్యులు అతన్ని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. రోగిని మొదట ఔట్ పేషెంట్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ పరీక్షించారు. రోగికి మానసిక అనారోగ్యం ఉందని, గత కొన్ని వారాలుగా నాణేలు, అయస్కాంతాలు మింగినట్లు బంధువులు తెలిపారు. రోగి కడుపుకి సంబంధించిన ఎక్స్‌రే కూడా వైద్యులకు చూపించారు. పొత్తికడుపు భాగంలో నాణేలు, అయస్కాంతాల ఆకారంలో ఉన్న చిత్రాలు కనిపించాయి. అవి ప్రేగులకు అడ్డుపడటంతో సమస్య తలెత్తినట్లు గుర్తించిన వైద్యులు.. వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు.

శస్త్రచికిత్స సమయంలో చిన్న ప్రేగులలో రెండు వేర్వేరు లూప్‌లలో అయస్కాంతాలు, నాణేలు ఉన్నట్లు కనుగొన్నారు. కడుపులో కూడా వివిధ భాగాల్లో ఉన్న నాణేలాను, అయస్కాంతాలను తొలగించారు. దాదాపు 2 గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో మొత్తం 39 నాణేలు (రూ. 1, 2, 5 నాణేలు), 37 అయస్కాంతాలు వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ తరుణ్ మిట్టల్, డాక్టర్ ఆశిష్ డే, డాక్టర్ అన్మోల్ అహుజా (కన్సల్టెంట్స్), డాక్టర్ విక్రమ్ సింగ్ (క్లినికల్ అసిస్టెంట్), డాక్టర్ తనుశ్రీ, డాక్టర్ కార్తీక్ వైద్య బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. ఆపరేషన్‌ తర్వాత రోగి ఆరోగ్యం మెరుగుపడిందని, వారం రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. వాటిని ఎందుకు మింగావని రోగిని వైద్యులు అడగ్గా.. నాణేలలో ఉండే జింక్ శరీరాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని, అందుకే వాటిని మింగానని, అయస్కాంతం, నాణెలు శరీరం జింక్‌ను గ్రహించడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వాటిని మింగడం వల్ల ప్రాణహాని ఉంటుందని, అలా చేయకూడదని అనికి చెప్పినట్లు డాక్టర్ మిట్టల్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.