Ayodhya: అయోధ్య రామయ్యకు రూ.25 కోట్ల విరాళాలు.! తొలి నెలలో అయోధ్యను భక్తులు 60 లక్షలు.

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. కానుకలు, విరాళాలను కూడా పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది.

Ayodhya: అయోధ్య రామయ్యకు రూ.25 కోట్ల విరాళాలు.! తొలి నెలలో అయోధ్యను భక్తులు 60 లక్షలు.

|

Updated on: Feb 27, 2024 | 1:04 PM

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. కానుకలు, విరాళాలను కూడా పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది. తొలి నెలలో 25 కోట్ల రూపాయల విలువైన విరాళాలు అందాయని తెలిపింది. 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాలు వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలోకి నేరుగా ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం తమకు తెలియదని వివరించారు. ఆలయంలో వినియోగించని వెండి, బంగారంతో చేసిన పాత్రలు, సామగ్రిని రామ్‌లల్లాకు విరాళంగా ఇస్తున్నారని, భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని స్వీకరిస్తున్నామని వెల్లడించారు. కాగా వెల్లువలా వచ్చి పడుతున్న భక్తుల కానుకలు, విరాళాలను సునాయాసంగా లెక్కించడానికి వీలుగా ఆలయంలో ఎస్‌బీఐ నాలుగు ఆటోమేటిక్ హైటెక్నాలజీ కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు.

విరాళాలకు సంబంధించిన రసీదులను జారీ చేయడానికి 12 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు సిద్దం చేశామని, ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల పెట్టెలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. విరాళాల లెక్కింపు కోసం త్వరలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద గదిని కూడా నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. శ్రీరామనవమి వేడుకల సమయంలో విరాళాలు పెరుగుతాయని రామమందిర్ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఈ సమయంలో అయోధ్య రామాలయాన్ని దాదాపు 50 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని లెక్కిస్తోంది. కాగా జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా నెల రోజుల వ్యవధిలో 60 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని ప్రకాశ్ గుప్తా పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us