Teacher: చదువుల తల్లి సరస్వతిపై నోరు పారేసుకున్న ఉపాధ్యాయురాలు.! టీచర్ నోటి దురుసు.

Teacher: చదువుల తల్లి సరస్వతిపై నోరు పారేసుకున్న ఉపాధ్యాయురాలు.! టీచర్ నోటి దురుసు.

Anil kumar poka

|

Updated on: Feb 27, 2024 | 8:40 AM

చదువుల తల్లి సరస్వతిపై స్వయంగా ఓ ఉపాధ్యాయురాలే నోరు పారేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిందీ ఘటన. ఆమె కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం కమిటీ వేశారు. తాజాగా ఆమెను విధుల నుంచి తొలగించారు. లకాడియాలోని ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే కోసం స్టేజీ ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు పెట్టారు.

చదువుల తల్లి సరస్వతిపై స్వయంగా ఓ ఉపాధ్యాయురాలే నోరు పారేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిందీ ఘటన. ఆమె కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం కమిటీ వేశారు. తాజాగా ఆమెను విధుల నుంచి తొలగించారు. లకాడియాలోని ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే కోసం స్టేజీ ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు పెట్టారు. వారి ఫొటోల సరసన సరస్వతీదేవి ఫొటో పెడుతుండగా హేమలతా భైర్వ అనే ఉపాధ్యాయురాలు అడ్డుకున్నారు. విద్య కోసం సరస్వతీదేవి ఏం చేసిందని ఆ ఫొటో పెడుతున్నారని ప్రశ్నిస్తూ ఫొటో పెట్టకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. వెంటనే దర్యాప్తు కోసం క్రమశిక్షణ కమిటీ వేశారు. దర్యాప్తు జరిపిన కమిటీ హేమలత వ్యాఖ్యలు నిజమేనని తేల్చి చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రతిపాదించింది. దీంతో ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ మాట్లాడుతూ.. సరస్వతీదేవిని టీచర్ హేమలత అవమానించి హిందూ దేవత పట్ల చులకన భావంతో మాట్లాడారని, అందుకే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..