AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AVAVAV: వైరల్‌ అవుతోన్న ‘అవవాన్’ ఫ్యాషన్‌ షో! మోడల్స్‌పై చెత్తవేసి, పానియాలు విసురుతూ.. ఏంటీ అవమానిస్తున్నారా?

క్రియేటివిటీకి అవధులు ఉండవనే విషయాన్ని ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అవవావ్(AVAVAV) మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2024 మరోసారి స్పష్టం చేసింది. డిజైనర్‌ వైరల్‌ రన్‌వేలను రూపొందించడంలో అవవావ్‌ స్టైలే వేరు. వీరు నిర్వహించే ఫ్యాషన్‌షోలు ఎప్పుడూ చర్చణీయాంశంగానే ఉంటాయి. తాజాగా వీరు నిర్వహించిన ఫ్యాషన్‌ షో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనికి కారణం ర్యాంప్‌ (వేదిక)పై క్యాట్‌వాక్‌ చేసే మోడల్స్‌పై చెత్తను, పానీయాలను విసరడమే..

AVAVAV: వైరల్‌ అవుతోన్న 'అవవాన్' ఫ్యాషన్‌ షో! మోడల్స్‌పై చెత్తవేసి, పానియాలు విసురుతూ.. ఏంటీ అవమానిస్తున్నారా?
MFW 2024 runway showcase
Srilakshmi C
|

Updated on: Feb 27, 2024 | 8:22 AM

Share

క్రియేటివిటీకి అవధులు ఉండవనే విషయాన్ని ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అవవావ్(AVAVAV) మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2024 మరోసారి స్పష్టం చేసింది. డిజైనర్‌ వైరల్‌ రన్‌వేలను రూపొందించడంలో అవవావ్‌ స్టైలే వేరు. వీరు నిర్వహించే ఫ్యాషన్‌షోలు ఎప్పుడూ చర్చణీయాంశంగానే ఉంటాయి. తాజాగా వీరు నిర్వహించిన ఫ్యాషన్‌ షో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనికి కారణం ర్యాంప్‌ (వేదిక)పై క్యాట్‌వాక్‌ చేసే మోడల్స్‌పై చెత్తను, పానీయాలను విసరడమే. మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ప్రదర్శన ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌ అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ AVAVAVపై ఆన్‌లైన్‌లో నెటిజన్లు ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. మోడల్స్‌పై చెత్తను వేయడం వల్ల ఇది ‘చెత్త’ ప్రదర్శన అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

అవవాను చెత్త బ్రాండ్‌ అని, దానికి సోషల్ మీడియాలో వచ్చిన తిరస్కరణ, వ్యతిరేకతలే ప్రేరణగా ఈ విధంగా కొత్తగా చెత్తను ఉపయోగిస్తూ ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ పాల్గొనేలా థీమ్‌ రెడి చేసినట్లు ఆ బ్రాండ్‌ యజమాని బీట్‌ కార్ల్‌సన్‌ ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చాడు. తమ బ్రాండ్‌ సామాజిక మాధ్యమాలలో తిరస్కారానికి గురైన విషయాన్ని మోడల్స్‌పై చెత్తను చల్లుతూ తెలియజేశామన్నారు. అందువల్లనే చెత్తతో నిండి ఉన్న వేదిక మీదే ఫ్యాషన్‌ షో నిర్వహించి విమర్శకుల నోర్లు మూయించామని ప్రతీకాత్మకంగా తెలిపారు. ఇక డిజైనర్‌ క్రియేటివిటీకి ప్రేక్షకులు, నెటిజన్లలో మిశ్రమ స్పందన వచ్చింది. మోడల్స్‌ ముఖంపై పానీయాలను చల్లడం వారిని అవమానించడమే అవుతుందని, వారిని అగౌరవపరిచినట్లుగా ఉంటుందంటూ ఫైర్‌ అయ్యారు. ఇది ఫ్యాషన్‌ షోలకే అవమానకరం అని ఘాటుగా విమర్శించారు. AVAVAV బ్రాండ్‌ను ప్రోత్సహించండి. ప్రతిసారీ ఈ ఫ్యాషన్‌ షో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుందని మరో నెటిజన్‌ మద్ధతు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా డిజైనర్ బీట్‌ కార్ల్‌సన్‌ వైరల్ రన్‌వేతో సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు వింతైన ఫ్యాషన్‌ షోలు నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత సెప్టెంబర్‌లో అవవావ్ ‘డిజైన్ చేయడానికి సమయం లేదు, వివరించడానికి సమయం లేదు’ అనే కాన్సెప్ట్‌తో సమ్మర్/స్ప్రింగ్ 2024 సేకరణను ప్రదర్శించింది. మోడల్‌లు సగం సగం దుస్తులు, మేకప్‌తో రన్‌వే పైకి పరుగెత్తుకు రావడంతో ప్రదర్శన ప్రారంభమైంది.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

AVAVAV (@avavav) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.