AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తక్షణ శక్తి కావాలా..? అలసట దూరం కావాలా..? అయితే ఈ పండు తినండి..!

దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎంతో విలువైనది. ఇందు లో విటమిన్ C, ఫోలేట్, పాలీఫెనోల్స్, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

మీకు తక్షణ శక్తి కావాలా..? అలసట దూరం కావాలా..? అయితే ఈ పండు తినండి..!
Pomegranate
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 8:22 PM

Share

దానిమ్మలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. రోజూ తినడం వల్ల పేగుల్లో వాపు తగ్గి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఫలితంగా వైరస్‌ లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు తట్టుకోగల శక్తిని శరీరం పొందుతుంది.

దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా విటమిన్ C, పోలీఫెనోల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మంలోని కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మానికి పటుత్వం, మృదుత్వం అందిస్తాయి. ముడతలు, పొడితనానికి ఇది సహజ పరిష్కారం.

ఈ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే టానిన్లు, ఆంథోసయానిన్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. రోజూ తినడం వల్ల రక్తపోటు తగ్గి గుండె సంబంధిత సమస్యల నుండి కాపాడే అవకాశం ఉంది.

దానిమ్మలోని పోషకాలు మెదడుకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా.. మతిమరుపు వ్యాధులను దూరంగా ఉంచే శక్తిని కలిగి ఉంది. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ మెదడు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.

దానిమ్మలో ఉండే విటమిన్ C శరీరంలో ఐరన్ శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. గర్భిణీలు, బాలింతలు, హార్మోన్ మార్పులు ఎదుర్కొనే స్త్రీలు దానిమ్మను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

దానిమ్మ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది సహజంగా శక్తిని అందించడంతోపాటు మానసిక అలసటను కూడా తగ్గిస్తుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. దానిమ్మ పండును మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ఇది శరీరాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది.