AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకి ఈ ఫుడ్స్ రెగ్యులర్‌ గా ఇవ్వండి.. జీర్ణశక్తిని పెంచే 5 అద్భుతమైన ఆహారాలు..!

పిల్లల శారీరక అభివృద్ధికి పునాది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ. జీర్ణం సరిగ్గా జరిగితేనే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలా కాకుండా ప్రేగులు బలహీనంగా ఉంటే.. శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందవు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు. అందువల్ల పిల్లల ఆహారంలో ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచే కొన్ని ముఖ్యమైన పదార్థాలను చేర్చడం చాలా అవసరం.

పిల్లలకి ఈ ఫుడ్స్ రెగ్యులర్‌ గా ఇవ్వండి.. జీర్ణశక్తిని పెంచే 5 అద్భుతమైన ఆహారాలు..!
Healthy Fruits For Kids
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 8:29 PM

Share

అరటిలో మంచి మొత్తంలో జీర్ణానికి మేలు చేసే పీచుపదార్థాలు ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ అనే గుణం ప్రీబయోటిక్‌ లా పనిచేస్తుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

చిలకడదుంపలో అధికంగా పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి ప్రేగులను శుభ్రంగా ఉంచుతూ మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చిలకడదుంపలను పిల్లలకు వేపి లేదా ఉడకబెట్టి ఇవ్వడం ద్వారా వారి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

ఓట్స్‌ లో ఉండే బీటా గ్లూకాన్ అనే పీచుపదార్థం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియాను పోషించి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఓట్స్‌ ను ఉదయాన్నే అల్పాహారంగా లేదా ఉడకబెట్టిన విధంగా పిల్లల ఆహారంలో చేర్చడం ఉత్తమం.

పెరుగు మంచి ప్రోబయోటిక్. ఇందులో లాక్టోబాసిలస్ వంటి మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ప్రేగుల ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ప్రాసెస్ చేసిన లేదా చక్కెర కలిపిన పెరుగును కాకుండా.. స్వచ్ఛమైన పెరుగు ఉపయోగించాలి. పెరుగు ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అదే విధంగా వ్యాధులపై పోరాడే శక్తిని కూడా పెంచుతుంది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు అధికంగా ఉండే పండ్లు. ఇవి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ప్రేగుల ఆరోగ్యం బాగుండాలంటే ఫైబర్ అవసరం. దీనికి బెర్రీలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మలబద్ధకం రాకుండా నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని స్నాక్స్‌ గా పిల్లలకు ఇవ్వవచ్చు.

ఈ ఆహారాలను పిల్లల రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. చక్కెర కలిపిన ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి.. ఈ సహజమైన పదార్థాలను ప్రోత్సహించడం ద్వారా మీ పిల్లల ఆరోగ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..