Diabetes Signs: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే అవి మధుమేహానికి సంకేతాలు.. అవెంటో తెలుసుకోండి..

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోన్న సమస్య మధుమేహం (Diabetes).  మన దేశంలో ఈ సమస్యతో అనేక మంది పోరాడుతున్నారు.

Diabetes Signs: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే అవి మధుమేహానికి సంకేతాలు.. అవెంటో తెలుసుకోండి..
Daibetes
Follow us

|

Updated on: Mar 27, 2022 | 5:55 PM

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోన్న సమస్య మధుమేహం (Diabetes).  మన దేశంలో ఈ సమస్యతో అనేక మంది పోరాడుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడం అంటే.. రక్తంలో చక్కర స్థాయిని కంట్రోల్ చేయడమే. శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ హెచ్చరిక సంకేతాలు అనేక రకాలుగా ఉంటాయి. మధుమేహం సమస్య ఉన్నప్పుడు రోగి ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను అస్సలు ఉత్పత్తి చేయదు లేదా చాలా తక్కువ పరిమాణంలో చేస్తుంది. ఇన్సులిన్ అనేది సాధారణంగా ప్యాంక్రియాస్ ద్వారా విడుదలయ్యే హార్మోన్. ఇది గ్లూకోజ్ శరీర కణాలలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అది శక్తి కోసం ఉపయోగించబడుతుంది. టైప్ 1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్‌లో, ఇన్సులిన్ చాలా తక్కువ పరిమాణంలో తయారు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి, ఇన్సులిన్ అధిక పరిమాణంలో అవసరం.

అయితే ఈ మధుమేహం సమస్యను చాలా మంది గుర్తించరు. ఫలితంగా ఈ సమస్య ప్రాణప్రాయ స్థితిలోకి చేరుకున్నాక తెలుసుకుంటారు. కానీ మధుమేహం సమస్య ఉందా లేదా అనేది కళ్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కళ్లలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా మధుమేహం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.. అదేలాగో తెలుసుకుందామా.

అస్పష్టత.. కళ్లలో అస్పష్టత కనిపిస్తే అది మధుమేహానికి సంకేతం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. కొన్నిసార్లు అది కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. కంటిశుక్లం.. డయాబెటిక్ రోగులలో కంటిశుక్లం సమస్య సమయానికి ముందే ప్రారంభమవుతుంది. మీకు మధుమేహం ఉంటే ఈ సమస్య చాలా పెరుగుతుంది. గ్లాకోమా.. కళ్ల నుండి నీరు బయటకు వెళ్లలేనప్పుడు ఇది సంభవిస్తుంది. దీంతో కళ్లపై ఒత్తిడి పడుతుంది. ఇది కళ్లలోని నరాలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఇది చూపులో సమస్యలను కలిగిస్తుంది. డయాబెటిక్ రోగులలో గ్లాకోమా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితిలో తలనొప్పి, కంటి నొప్పి, కళ్ళు మసకబారడం లేదా నీరు కారడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే అది గ్లాకోమా.. డయాబెటిస్‌కు కారణం కావచ్చు. డయాబెటిక్ రెటినోపతి.. డయాబెటిక్ రెటినోపతి అనేది రక్తంలో చక్కెరతో బాధపడుతున్న వ్యక్తి రెటీనాపై ప్రభావం చూపే సమస్య. ఇది రెటీనాకు రక్తాన్ని తీసుకువెళ్ళే చాలా సన్నని సిరలు దెబ్బతినడం వలన సంభవిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, వ్యక్తి అంధత్వానికి గురవుతారు.

గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనల ఆధారంగా.. ఇతర వెబ్ సైట్స్ ఆధరంగా చేసుకుని మాత్రమే ఇవ్వబడింది. వీటిని అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌