AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

యావత్ దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (RRR) మేనియా కొనసాగుతుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..
Rrr
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2022 | 3:14 PM

Share

యావత్ దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (RRR) మేనియా కొనసాగుతుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు పెద్ధ సంఖ్యలో ఎగబడుతున్నారు. చాలా కాలం తర్వాత థియేటర్లలో హౌస్ పుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ (Ram Charan).. ఎన్టీఆర్‏ల నటనకు అభిమానులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు. మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా టాలీవుడ్ గత రికార్డులను చెరిపేస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. చెర్రీ.. తారక్‏ల స్నేహబంధాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉన్న సమయంలో కొందరు అభిమానులు చేసే ఆత్యుత్సాహం మాత్రం అటు ప్రేక్షకులకు.. ఇటు ఆర్ఆర్ఆర్ మేకర్స్‏కు తలనొప్పిగా మారింది.

కొందరు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం కాకుండా.. మూవీలోని పలు సీన్స్ ఫోన్లలో రికార్డ్ చేసి వాట్సప్ స్టేటస్.. ఇన్‏స్టా.. ఫేస్‏బుక్‏లలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమాను థియేటర్లలో చూద్దాం అనుకున్నవారికి మూవీలోని కీలక సన్నివేశాలు.. ఇలా ఫోన్లలో దర్శనమిస్తుండడంతో సినిమా చూసేందుకు ఆసక్తి తగ్గుతుందని వాపోతున్నారు. ఇప్పటికే సగానికిపైగా ఫోన్లలోనే చూశామని.. మిగతా సినిమా కోసం థియేటర్ వరకు వెళ్లాలని లేదంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయం ఆర్ఆర్ఆర్ మేకర్స్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.. ” డియర్ ఫ్యాన్స్.. సినిమాలోని సీన్స్ రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కోరుతున్నాం… ఆర్ఆర్ఆర్ సినిమా మ్యాజిక్‏ను మీరు అతి పెద్ద స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేసినట్టుగానే ఇతరులు కూడా చూడాలని కొరుకుంటున్నాం ” అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో అలియా భట్.. అజయ్ దేవగణ్.. శ్రియా సరన్ కీలకపాత్రలలో నటించారు.

ట్వీట్..

Also Read: Ram Charan: కూల్ కూల్ లుక్‌లో చరణ్.. సిద్దకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆచార్య యూనిట్

Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..

Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..