AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..

Priyanka Mohan: చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ సంపాదించుకుంది అందాల తార ప్రియాంక మోహన్‌. పట్టుమని పది సినిమాలు కూడా చేయకముందే ఈ అమ్మడి పేరు అందరికీ సుపరిచతంగా మారింది. 2019లో కన్నడ సినిమా ద్వారా..

Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..
Priyanka
Narender Vaitla
|

Updated on: Mar 27, 2022 | 1:16 PM

Share

Priyanka Mohan: 2019లో కన్నడ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార ప్రియాంక మోహన్‌. రెండో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాండ్ లీడర్‌’ చిత్రంతో ఒక్కసారిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టేసింది. తన క్యూట్‌ లుక్స్‌, న్యాచురల్‌ యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసింది. ఇక శ్రీకారం సినిమాలో తళుక్కుమన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ఏకంగా మూడు చిత్రాల్లో నటించి సౌత్‌ ఇండియన్‌లో క్రేజీ హీరోయిన్ల జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుంది.

ఇలా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతోన్న ప్రియాంక.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫోటో షూట్‌లకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ఈ క్యూట్‌ గర్ల్‌కు అలవాలు. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక ఓ ఫోటో షూట్‌కు పోజిలిచ్చింది. ప్రస్తుతం సదరు ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తోంది.

రెడ్‌ కలర్‌ డ్రస్‌లో నెత్తిన రెడ్‌ కలర్‌ కిరీటంతో అచ్చంగా దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రియాంక అందానికి ఫిదా అవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం తమిళంలో డాన్‌, ఎతర్కుమ్‌ తునిధావన్‌ అనే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ పలు సినిమాలకు ఈ బ్యూటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Also Read: Telangana: ఛా.. కనీసం ఇంగితం లేకుండా.. స్కూల్ ముందే.. బెంబేలెత్తిపోయిన విద్యార్థులు

సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!