AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛా.. కనీసం ఇంగితం లేకుండా.. స్కూల్ ముందే.. బెంబేలెత్తిపోయిన విద్యార్థులు

ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నారు కొందరు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.

Telangana: ఛా.. కనీసం ఇంగితం లేకుండా.. స్కూల్ ముందే.. బెంబేలెత్తిపోయిన విద్యార్థులు
Occult Worship
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2022 | 11:29 AM

Share

Jainath: ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నారు కొందరు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టాం కానీ.. ఈ చేతబడులకు, క్షుద్రపూజలకు బ్రేకులు వేయలేకపోతున్నాం. తాజాగా  ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లోని ఆదర్శ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు టెన్షన్ రేపాయి. శుక్రవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. స్కూల్ గేట్ ఎదుట రెండు ఇనుప కడ్డీల చుట్టూ వస్త్రం చుట్టి, భూమిలో పాతారు. దాని ముందు.. రెండు కోడిగుడ్లు పెట్టి, పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెల్లవారుజామున ఎప్పట్లానే స్కూలుకు వచ్చిన స్టూడెంట్స్ గేటు ముందర పసుపు, కుంకుమ, కోడిగుడ్లు పడి ఉండటాన్ని చూసి భయపడ్డారు. వెంటనే స్కూలు లోపలికి వెళ్లి టీచర్లకు విషయం చెప్పారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని తొలగించి రోజూలానే క్లాసులు నిర్వహించారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్​ మహమ్మద్​ జావెద్​ను వివరణ అడగ్గా.. స్టూడెంట్స్‌ను భయభ్రాంతులకు గురిచేయడానికి పోకిరీలు చేసిన పనిగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది చేత వాటిని తొలగించినట్లు తెలిపారు.

Also Read: Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే