Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే

తెలంగాణలో ట్రాఫిక్ ఛలాన్ల క్లియరెన్స్ కు అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే రాయితీతో కలిపి 190 కోట్లు వసూలైనట్లు చెప్పారు అధికారులు. ఇక ఏప్రిల్ నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి రానున్నాయి.

Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే
Telangana Traffic Rules
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2022 | 5:23 PM

ఏప్రిల్‌ నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్(Traffic Joint CP Ranganath). ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తామని హెచ్చరించారు. కోవిడ్(Corona) కారణంగా గ్యాప్ ఇచ్చామని.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని చెప్పారు రంగనాథ్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న రంగనాథ్.. త్వరలో స్పీడ్ లిమిట్(Speed Limit) విధానం అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive) పై కఠిన చర్యలు ఉంటాయని.. తాగి వాహనం నడిపేతే జైలుకు పంపుతామని హెచ్చరించారు ట్రాఫిక్‌ జాయింట్ సీపీ రంగనాథ్. వాహనాల అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ అంటించరాదని.. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్దంటూ స్టిక్కర్స్ వేసుకొని తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు రంగనాథ్. పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్స్ మాత్రమే వాడాలని.. రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు రంగనాథ్.

తెలంగాణలో పెండింగ్ ఛలాన్లపై పోలీస్ శాఖ ఇచ్చిన బంఫర్ ఆఫర్ కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. 650 కోట్ల రూపాయలకు పైగా విలువైన పెండింగ్ ఛలాన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. రాయితీ పోనూ 190 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలాన్లు క్లియర్ చేశారని.. రోజుకు ఏడు నుండి పది లక్షల పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నట్లు చెప్పారు రంగనాథ్. రాయితీ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమేనని స్పష్టం చేశారు. పెండింగ్ ఛలాన్లు ఉన్నవారు రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయితీ గడుపు పొడిగింపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. 15 వందల కోట్ల విలువ చేసే ఛలాన్లు పెండింగ్ ఉన్నాయని.. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు రంగనాథ్.

Also Read:  ‘అలాంటి కొడుకుల కుత్తుకలు కోయాలి’.. RRRను విమర్శించేవారిపై నిర్మాత పీవీపీ సంచలన వ్యాఖ్యలు