PVP: ‘అలాంటి కొడుకుల కుత్తుకలు కోయాలి’.. RRRను విమర్శించేవారిపై నిర్మాత పీవీపీ సంచలన వ్యాఖ్యలు
కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ ఊర మాస్.. అల్లూరి గెటప్‌లో అదరగొట్టిన రామ్ చరణ్.. ప్రేక్షకులను కట్టిపడేసే రాజమౌళి రీల్ మాయాజాలం.. ఒక్క మాటలో చెప్పాలంటే జక్కన్న చెక్కిన శిల్పం.. RRR.
RRR రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా, నందమూరి అభిమానులకు.. నేడు పండగ కాదు అంతకు మించి.. వెయ్యేండ్లకు పెద్ద పండగ వచ్చినట్టు చెప్పాలి. ఎక్కడ చూసినా అభిమానుల జాతరే కనిపిస్తుంది. కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్(Jr NTR) ఊర మాస్ ఎలివేషన్స్.. అల్లూరి గెటప్‌లో రామ్ చరణ్(Ram Charan) పలికిన సంభాషణలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా RRR ప్రేక్షకులను కట్టిపడేసే రాజమౌళి రీల్ మాయాజాలం.. ఒక్క మాటలో చెప్పాలంటే జక్కన్న చెక్కిన శిల్పం.. RRR. ఓవైపు ఫ్యాన్స్ పల్స్ సినిమా రేటింగ్‌ను అమాంతం హైలైట్ చేస్తే.. కొందరు మాత్రం కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని చూసి.. గర్వించకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దేశభక్తితో నిండిన ఇలాంటి సినిమా తీసిన, నటించిన వ్యక్తుల కులాల్ని బయటకు లాగి.. కొత్త కుంపటిని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చి రాతలు, చీప్ కామెంట్స్‌తో పేట్రేగిపోతున్నారు. అలాంటి వారిపై నిప్పులు చెరిగారు ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ. కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
“జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. Respect freedom of speech, but there is a fine line of agenda and objective views !. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు.. సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి.. Load,aim and shoot your views” అంటూ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు పీవీపీ. ప్రస్తుతం ఆయన పెట్టిన ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: వాహనం ఆగిందని సాయం చేద్దామనుకున్న పోలీసులు.. దగ్గరకు వెళ్లి చెక్ చేయగా షాక్..
RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?