Andhra Pradesh: వాహనం ఆగిందని సాయం చేద్దామనుకున్న పోలీసులు.. దగ్గరకు వెళ్లి చెక్ చేయగా షాక్..

శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఎర్ర చందనాన్ని అక్రమార్కులు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తున్నారు.

Andhra Pradesh: వాహనం ఆగిందని సాయం చేద్దామనుకున్న పోలీసులు.. దగ్గరకు వెళ్లి చెక్ చేయగా షాక్..
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2022 | 3:53 PM

Chittoor district: ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఏపీలోని  రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఎర్ర చందనాన్ని అక్రమార్కులు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా  చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంగాధర నెల్లూరు(Gangadhara Nellore) మండలం ముష్టిపల్లి వద్ద రోడ్డుపై ఓ వాహనం ఆగి కనిపించింది. తొలుత ఏదో రిపేర్ వచ్చిందేమో అనుకున్నారు. దగ్గరకు వెళ్లాక.. అనుమానం రావడంతో చెక్ చేయగా.. లోపల ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆ వాహనం నడుపుతున్న స్మగ్లర్ దొరికిపోయాడు. అతను ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మరో వాహనాన్ని చేజ్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వాహనం బోల్తా పడింది. దీంతో అక్కడే  ఎర్ర చందనం దుంగలను వదిలి ఆ వాహనంలోని ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పోలీసులు వారిని కూడా వెంటాడి పట్టుకున్నారు. రెండు వాహనాలను,  30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అంతరాష్ట్ర స్మగ్లర్లు అని తెలిపారు. వారిని చిత్తూరు జిల్లాకు చెందిన రాజేష్, తమిళనాడుకు చెందిన దేవస్ కుమార్, ఏకాంబరం హేమ కుమార్‌లుగా గుర్తించారు.

జపాన్, చైనా, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. ఫారెన్‌లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అందుకోసం కొందరు ప్రాణాలకు తెగిస్తున్నారు.

Also Read: RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!