Pegasus Spyware: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై హౌస్‌ కమిటీ.. చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..

House Committee on Pegasus Spyware Deal: చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ ప్రయోగించిందన్న ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ(AP Assembly) హైస్‌ కమిటీ వేసింది. భూమన కరుణాకర్‌ రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీ వేశారు. తెలుగు దేశం పార్టీ(TDP) పెగాసెస్‌ వ్యవహారంపై..

Pegasus Spyware: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై హౌస్‌ కమిటీ.. చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..
House Committee On Pegasus
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 25, 2022 | 2:43 PM

చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌(Pegasus Spyware) ప్రయోగించిందన్న ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ(AP Assembly) హైస్‌ కమిటీ(House Committee) వేసింది. భూమన కరుణాకర్‌ రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీ వేశారు. తెలుగు దేశం పార్టీ(TDP) పెగాసెస్‌ వ్యవహారంపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం హౌస్‌ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్‌, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను మెంబర్లుగా ఉండనున్నారు. కాగా రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ రచ్చ గత కొద్దిరోజులుగా కుదిపేస్తోంది. టీడీపీ హయాంలో పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది.

అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్‌ ఉదంతంపై హౌస్‌ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై స్పీకర్‌ హౌస్‌ కమిటీ వేశారు.

పెగాసస్‌ స్పైవేర్‌ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. తమపై చంద్రబాబు అక్రమంగా నిఘా పెట్టారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. దీనిపై హౌస్‌ కమిటీ వేశారు. అటు టీడీపీ ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న వైసీపీ ఏకంగా అసెంబ్లీ వేదికగా భారీ చర్చ పెట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

వైసీపీతోపాటు సహచర బీజేపీ నేతలపైనా పెగాసస్‌ ఉపయోగించారన్నారు. పెగాసస్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతమన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన. ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనడం చాలా దుర్మార్గమన్నారు. పెగాసస్‌ రాష్ట్రానికే కాదు, దేశ భద్రతకు ముప్పన్నారు. దీనిపై తక్షణ విచారణ అవసమన్నారు మంత్రి బుగ్గన.పెగాసస్‌ అంశంపై హౌస్‌ కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు ఏపీ మంత్రి కురసాల కన్నబాబు. త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయన్నారు.

ఇవి కూడా చదవండి: Yogi Adithyanath: యూపీలో బుల్డోజర్ బాబా హవా.. విజయంతో ముస్లిం యువతలో క్రేజ్.. పూర్తి వివరాలివే

Birbhum Incident: రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారు.. రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీ రూపా గంగూలీ

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే