Yogi Adithyanath: యూపీలో బుల్డోజర్ బాబా హవా.. విజయంతో ముస్లిం యువతలో క్రేజ్.. పూర్తి వివరాలివే

యూపీలో బుల్డోజర్ బాబా హవా సాగుతోంది. ఒంటి చేత్తో రెండుసార్లు రాష్ట్రంలో బీజేపీని(BJP) గెలిపించిన బుల్డోజర్ బాబా.. రాష్ట్రంలో గత 39 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీని రెండోసారి గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజా విజయంతో...

Yogi Adithyanath: యూపీలో బుల్డోజర్ బాబా హవా.. విజయంతో ముస్లిం యువతలో క్రేజ్.. పూర్తి వివరాలివే
Yogi Adityanath.jpg
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 25, 2022 | 1:54 PM

యూపీలో బుల్డోజర్ బాబా హవా సాగుతోంది. ఒంటి చేత్తో రెండుసార్లు రాష్ట్రంలో బీజేపీని(BJP) గెలిపించిన బుల్డోజర్ బాబా.. రాష్ట్రంలో గత 39 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీని రెండోసారి గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజా విజయంతో యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath) పట్ల యూపీ ముస్లిం యువతలో క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ బుల్డోజర్ బాబా ఎవరు? ఆ పేరు వెనుక కథ ఏమిటో చూద్దాం.. ‘బుల్డోజర్ బాబా’గా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచారు. 2017లో సీఎం అయిన తర్వాత అవినీతి, హింస, నేరాలు, అత్యచారాల పట్ల యోగి జీరో టాలరెన్స్ ప్రదర్శించారు. అప్పటి నుంచి ల్యాండ్ మాఫియా, డాన్ లను అణచివేసే కార్యక్రమం చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోవస్తే నేరాలను, నేరగాళ్లను అణిచివేసేందుకు వారిపై బుల్డోజర్ ఎక్కిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఎన్నికల సమయంలో తీవ్రంగా మారింది. ప్రజలను వంచించి ఆస్తులను నిర్మించుకుంటున్న మాఫియాకు బుల్డోజర్లు సమాధానం చెబుతాయన్న ప్రకటనతో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా అభివర్ణించారు. 2017 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ల్యాండ్ మాఫియాపై యోగి ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మాఫియా కబ్జానుంచి 67,000 ఎకరాల ప్రభుత్వ భూములను విముక్తి చేశారు. తాజాగా 2022 మార్చిలో బుల్డోజర్ తో అవినీతికి ల్యాండ్ మాఫియాకు చెక్ పెట్టారు.

Bulodzer

Bulodzer

ప్రయాగ్ రాజ్ లో ఓ మహిళపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్న యోగి ప్రభుత్వం..నిందితుడిని పట్టుకోవడానికి ఏకంగా బుల్డోజర్ తో నిందితుడి ఇంటికి పోలీసులను పంపించింది. నిందితుడిని లొంగిపొమ్మని లేకపోతే ఇంటిని కూల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నిందితుడు లొంగకపోవడంతో ముందు ఇంటి ప్రహరీని కూలగొట్టారు. మరో మార్గం లేక నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. విజయోత్సవ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు బుల్డోజర్లతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పరిస్థితులతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పట్ల యూపీ యువతలో క్రేజ్ పెరిగింది. బుల్డోజర్ గుర్తులను కొందరు తమ చేతులపై టాటూలు వేయించుకున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు ప్రయోజనం పొందుతున్నారంటూ ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్‌ వాల్ జిల్లా, పాంచూర్ గ్రామంలో 1972 జూన్ 5న యోగి ఆదిత్యనాథ్ జన్మించారు. 2017లో శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా సీఎం పదవి చేపట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన యోగి.. గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రధాని మోడీకి వారసుడిగా పేరుపొందారు. గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 1998 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి.. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారు. అంతే కాకుండా గోరఖ్ పూర్ మఠాధిపతిగా వ్యవహరించారు. మఠాధిపతిగా ఉన్న తన తండ్రి మహంత్ వైద్యనాథ్ మరణాంతరం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందుండి పార్టీకి విజయం అందించారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Also Read

Challan offer: ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ ఆఫర్ కు అనూహ్య స్పందన.. ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..?

Yadadri Temple: నరసింహుడు ఐదు రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం.. స్వామివారు పాంచ నరసింహుడిగా ప్రసిద్ధి..

Mysore: అన్న మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తమ్ముడు.. ఏకంగా 24 ఏళ్ల పాటు..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!