AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysore: అన్న మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తమ్ముడు.. ఏకంగా 24 ఏళ్ల పాటు..

Mysore: తోడబుట్టిన అన్న మరణాన్ని సైతం తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు ఓ తమ్ముడు. అందరినీ మోసం చేసి మరణించిన అన్న స్థానంలో ఏకంగా 24 ఏళ్ల పాటు ఉద్యోగాన్ని అనుభవించాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

Mysore: అన్న మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తమ్ముడు.. ఏకంగా 24 ఏళ్ల పాటు..
Narender Vaitla
|

Updated on: Mar 25, 2022 | 10:59 AM

Share

Mysore: తోడబుట్టిన అన్న మరణాన్ని సైతం తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు ఓ తమ్ముడు. అందరినీ మోసం చేసి మరణించిన అన్న స్థానంలో ఏకంగా 24 ఏళ్ల పాటు ఉద్యోగాన్ని అనుభవించాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లా కేఈఆర్‌ నగర్‌ తాలూకా హెబ్బాళు గ్రామానికి చెందిన లోకేశ్‌ గౌడ 1994-95లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. అయితే విధుల్లో చేరేకంటే ముందు అతను అకాల మరణం చెందాడు.

దీంతో లోకేశ్‌ గౌడ తమ్ముడు లక్ష్మణ గౌడకు ఒక కన్నింగ్‌ ఆలోచన వచ్చింది. మరణించిన తన అన్న స్థానంలో ఉద్యోగంలో చేరాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నియామకపు పత్రంతో తానే లోక్‌శ్‌గౌడ అని చెప్పుకొని పెరియ పట్టణ పరిధిలోని ముద్దనహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఇలా ఏకంగా 24 ఏళ్ల పాటు టీచరుగా విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు.

అయితే అబద్ధం ఎక్కువ రోజు దాగదు అన్నట్లు. లక్షణ గౌడ బండారం బయట పడింది. రెండేళ్ల క్రితం హుణసూరుకు చెందిన ఓ విలేకరికి ఈ విషయం తెలియగానే వివరాలు సేకరించారు. అనంతరం లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా. సమగ్ర విచారణ జరపగా, వీరి వంశవృక్షంలో లక్ష్మణగౌడ అనే పేరే లేకుండా చేసినట్లు గుర్తించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఈ నెల 21 లక్ష్మణ గౌడను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: India-China: లడఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి చైనా విదేశాంగ మంత్రి.. మరికాసేపట్లో కేంద్రమంత్రితో భేటీ

Road Accident: ఫ్యాన్స్ బెన్‌ఫిట్ షోకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అభిమానుల దుర్మరణం

Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!