AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: రెండో భార్యకు తెలియకుండా ప్రేయసితో వివాహం.. మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. అసలేమైందంటే?

ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని కంకేర్ కు చెందిన తులసీదాస్ మానిక్​పురి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2009లో మొదటి వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయాడు. 2014లో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. 2021లో అతనికి ఇంద్రాణి అనే...

Crime news: రెండో భార్యకు తెలియకుండా ప్రేయసితో వివాహం.. మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. అసలేమైందంటే?
Arrest Hyderabad
Ganesh Mudavath
|

Updated on: Mar 25, 2022 | 11:38 AM

Share

ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని కంకేర్ కు చెందిన తులసీదాస్ మానిక్​పురి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2009లో మొదటి వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయాడు. 2014లో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. 2021లో అతనికి ఇంద్రాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిరచయం కాస్తా ప్రేమ(Love) గా మారింది. ప్రేమ మైకంలో మునిగిపోయిన తులసీదాస్ రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి (Marriage) చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య తులసీదాస్ తో గొడవ పడింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని భావించిన తులసీదాస్ ఆమెను చంపేయాలని ప్రణాళిక రచించాడు. మూడో భార్యతో కలిసి పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంద్రాణి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని బరోడా నుంచి కోక్డికి సఫారీ వాహనంలో తీసుకెళ్లారు. డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించి, మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ ఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తులసీదాస్ ను పట్టుకున్నారు. మూడో భార్యతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధరించారు. తులసీదాస్ మార్క్​ఫెడ్​లో ఫీల్డ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడని, లొకేషన్​ను మార్చుకుంటూ కనిపించకుండా పోయాడని వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు రాయ్​పుర్, బాలోద్, కవార్దా, దుర్గ్ జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామన్నారు. అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. అతడి మూడో భార్య ఇంద్రాణిని రాయ్​పుర్​లో అదుపులోకి తీసుకున్నారు.

Also ReadKRK on RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్

India-China: లడఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి చైనా విదేశాంగ మంత్రి.. మరికాసేపట్లో కేంద్రమంత్రితో భేటీ

NBCC Recruitment: నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే