AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRK on RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్

KRK Slams RRR: గత నాలుగేళ్లుగా ఎదురుచూపులకు తెర దించుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో

KRK on RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్
Krk On Rrr Movie
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 25, 2022 | 9:58 AM

Share

KRK on RRR: గత నాలుగేళ్లుగా ఎదురుచూపులకు తెర దించుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) లు హీరోలుగా హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా పై స్వయం ప్రకటిత విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆర్ఆర్ఆర్ తలా తోకాలేని సినిమా అని అంటున్నాడు ఈ బాలీవుడ్ క్రిటిక్ కమ్ నటుడు కమల్ ఆర్. ఖాన్. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాను తీసిన రాజమౌళికి జైలు శిక్ష విధించాలని కూడా సంచలన కామెంట్స్ చేశాడు.

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు తీయనటువంటి చెత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దీన్ని పొరపాటు అని నేను అనను. ఇదొక పెద్ద నేరం. రూ. 600 కోట్ల రూపాయలతో ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలి” అని కమల్ ఆర్. ఖాన్ ట్వీట్స్ చేశాడు.

హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు కంప్లీట్ కాకముందే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షోస్ స్టార్ట్ కాకముందే.. దర్శకుడు రాజమౌళిపై, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డాడు. మరోసారి దక్షిణాది సినిమాపై ఉన్న తన అక్కసును అంతా వెళ్లగక్కాడు. ‘ఆర్ఆర్ఆర్’ అట్టర్ ప్లాప్ అని ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో కంపేర్ చేశాడు. చాలా మంది అతని సమీక్షలను సీరియస్‌గా తీసుకోనప్పటికీ, RRR గురించి కమల్ R ఖాన్ ఏమి ట్వీట్ చేసాడో చూడండి.

Read Also :

RRR-NTR: మహేష్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోని ఫ్యామిలీతో కలిసి చూసిన ఎన్టీఆర్.. విక్టరీ సొంతం అంటున్న తారక్

Vijay Sethupathi: మరోసారి మంచి మనసు చాటుకున్న మక్కల్‌ సెల్వన్‌ .. సైలెంట్‌గా లక్షల మందికి పైగా..