RRR-NTR: మహేష్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోని ఫ్యామిలీతో కలిసి చూసిన ఎన్టీఆర్.. విక్టరీ సొంతం అంటున్న తారక్
RRR-NTR: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే వినిపిస్తోంది. గత నాలుగేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల..
RRR-NTR: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే వినిపిస్తోంది. గత నాలుగేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకు క్యూలు కడుతున్నారు. అయితే దక్షిణాది మెగా మల్టీస్టారర్ (Mega Multi Starrer) సినిమా ఆర్ఆర్ఆర్ లో నటించిన కొమరం భీం గా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) కూడా గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూశారు. మహేష్ బాబు(Mahesh Babu) థియేటర్ AMB సినిమాస్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలు, నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు.
సినిమా థీయేటర్ కు ఆ సమయంలో వచ్చిన అభిమానులకు ఎన్టీఆర్ విక్టరీ సింబల్ చూపిస్తూ థీయేటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిపి నటించిన మల్టీస్టారర్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ గురించే టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో చేసిన నేపథ్యంలో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తూ బొమ్మ అదిరింది అంటున్నారు. తెలుగురాష్ట్రాలలో పాటు, ఓవర్సీస్ లో ప్రదర్సించిన బెనిఫిట్ షో లు చూసిన అభిమానులు.. బ్లాక్ బాస్టర్ హిట్ అని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటనతో పాటు అజయ్ దేవగన్ నటన కూడా అదిరింది అంటున్నారు. రాజమౌళి టేకింగ్, స్క్రీన్ ప్లే బాగుందని.. జక్కన్న చెక్కిన మరో కళాఖండం అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.
Also Read:
RRR Movie: సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం.. రచ్చ చేసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్..
Road Accident: ఫ్యాన్స్ బెన్‌ఫిట్ షోకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అభిమానుల దుర్మరణం