Vijay devarakonda: విజయ్‌, సమంత సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. అలనాటి సూపర్‌ హిట్‌ చిత్రం ఇతివృత్తంతో.?

Vijay devarakonda: తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకున్నారు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్‌ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్..

Vijay devarakonda: విజయ్‌, సమంత సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. అలనాటి సూపర్‌ హిట్‌ చిత్రం ఇతివృత్తంతో.?
Vijay Devarakonda Movie
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 25, 2022 | 9:59 AM

Vijay devarakonda: తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకున్నారు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్‌ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ (Liger) సినిమాలో నటిస్తోన్న విజయ్‌.. ఈ చిత్రం పూర్తికాగానే ‘మజిలీ’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని సమాచారం.

ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా సమంత (Samantha) నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కథకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కశ్మీర్‌ నేపథ్యంలో సాగనుందని సమాచారం. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా తరహాలో ఈ సినిమా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ఎన్నో ఎమోషన్స్‌తో కూడిన ఈ ప్రేమ కథను ఈ తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా శివ స్క్ర్పిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమా పూర్తిగా భావోద్వేగాలతో కూడుకొని ఉంటుందని, ఇందులో విజయ్‌ పాత్ర కూడా సరికొత్త పంథాలో సాగుతుందని సమాచారం. విజయ్‌ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరి ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Tax Planning: చివరి క్షణాలో తొందర వద్దు.. ముందుగానే ఇలా టాక్స్ ప్లానింగ్ చేసుకోండి..

Viral News: గూగుల్ మ్యాప్స్‌లో వింత పర్వతం.. ఏంటా చూస్తే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..!

Viral Video: నూడుల్స్‌ సూప్‌లో ఐస్‌క్రీమ్‌.. లొట్టలేసుకుని తింటోన్న కస్టమర్లు.. ఎక్కడంటే..

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..