RRR Movie: సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం.. రచ్చ చేసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్..

సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం తెలత్తింది. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్‌ యాజమాన్యాం దగ్గరి పంచాయితీ పెట్టారు ఫ్యాన్స్‌

RRR Movie: సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం.. రచ్చ చేసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2022 | 11:16 AM

RRR: సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం తెలత్తింది. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్‌ యాజమాన్యాం దగ్గరి పంచాయితీ పెట్టారు ఫ్యాన్స్‌. సినిమా టికెట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు మెగా ఫ్యాన్స్‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చలనచిత్రం విడుదలకు ముందే అభిమానులు గొడవకు దిగారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడం.. పరోక్షంగా రాజకీయ నేతల హస్తం ఉండటంతో స్థానిక థియేటర్‌ వద్ద గందరగోళ పరిస్థితి కనిపించింది. తొలుత ఓ హీరో అభిమానులు వచ్చి సింహభాగం టికెట్లు తమకే ఇవ్వాలని పట్టుబట్టగా ఇది తెలుసుకున్న మరోవర్గం అభిమానులు గొడవకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారి థియేటర్‌లో ఓతలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను అభిమానులు ధ్వంసం చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు యత్నించారు. థియేటర్‌ వద్ద పరిస్థితి ఇలా ఉంటే చలనచిత్రం విడుదల సందర్భంగా పద్మశాలిపేటకు చెందిన కొందరు ఇద్దరు కథానాయకుల ఫొటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హీరోల చిత్రాలకు రక్తతిలకం దిద్దారు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలో భారతీయులు ఉన్న చోట్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా నడుస్తోంది. ఇప్పటికే బెన్‌ఫిట్‌ షోలు, ప్రీమియర్‌ ఫోలు మొదలయ్యాయి.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌, అజయ్ దేవగణ్, శ్రియా శరన్.. సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. రిలీజ్​కు ముందే​రికార్డులను తిరగేస్తున్న ఈ సినిమాను ఫస్ట్‌ షోలోనే చూడాలని ఫ్యాన్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక థియేటర్ల వద్ద హీరోల కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!