Mekedatu project: కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ కాక.. మెకెదాతు డ్యామ్‌పై హాట్ హాట్ రచ్చ..

కావేరీ కాక.. కర్నాటక-తమిళనాడు మధ్య కాగుతోంది. మాటకు మాట పెరిగి ప్రత్యక్ష ఫైటింగ్‌ వరకు వెళ్లే వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ప్రాజెక్టుపై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాయి. ఒకరు నిర్మిస్తామంటే.. మరొకరు కుదురనే కుదురదు..

Mekedatu project: కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ కాక.. మెకెదాతు డ్యామ్‌పై హాట్ హాట్ రచ్చ..
Mekedatu Project
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 24, 2022 | 11:20 PM

తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నాటక అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. కావేరి నదిపై మేకెదాతు ఆనకట్ట(Mekedatu project) మేం తప్పక నిర్మిస్తామని ప్రకటించింది. కర్నాటక భూభాగంలోనే మేగదాదు నిర్మాణం ఉంటుందని సీఎం బసవరాజు బొమ్మై చెప్పారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో తమిళనాడు జోక్యం మంచిదికాదన్నారు. మిగులు జలాలపై ప్రశ్నించే అధికారం తమిళనాడుకు లేదన్నారు బొమ్మై. దీంతో.. కర్నాటక, తమిళనాడు మధ్య మెకెదాతు ఆనకట్ట వివాదం ముదురుపాకాన పడుతోంది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ తమిళనాడు కోరుతోంది. కావేరీ నదిపై మెకెదాతు డ్యామ్‌ను నిర్మించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన రెండురోజులకే కర్నాటక అసెంబ్లీ కూడా చర్చించింది. తమిళనాడు నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్నాటక అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది.

కావేరి నదిపై మేగదాదు ఆనకట్ట మేం తప్పక నిర్మిస్తామని కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై చెప్పారు. కర్నాటక భూభాగంలోనే మేకెదాతు నిర్మాణం ఉంటుందనీ, అటువంటప్పుడు తమ ప్రభుత్వ నిర్ణయాల్లో తమిళనాడు జోక్యం మంచిది కాదని CM బస్వరాజు బొమ్మై చెప్పారు.

మేకెదాతు ద్వారా మిగులు జలాలలను మాత్రమే తాము ఉపయోగిస్తామని CM చెప్పారు. దీంతో మెకెదాతు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంటుంది. ఈ వివాదంలో కేంద్రప్రభుత్వం ఏం చేస్తుందన్నదే అసలుపాయింట్‌.

ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..