TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (POLYCET)కు నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ ఈ నోటిఫికేషన్‌ను..
తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet)కు నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ ఈ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది. జూన్ 4 వరకు పాలిసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. రూ. వంద ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30వ తేదీన పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు ఉంటాయని తెలిపారు. పాలీసెట్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్/నాన్ ఇంజినీరిగ్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే. పాలీసెట్ 2022-2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- పాలీసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో నడుస్తోన్న సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహా రావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
- పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల ప్రక్రియను ఏప్రిల్ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ.
ఇవి కూడా చదవండి: Dental Health: మీ దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే.. వీటిని తప్పకుండా తినండి..
Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..