FRI Dehradun Recruitment 2022: ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

ఐసీఎఫ్‌ఆర్‌ఈకి చెందిన డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (FRI).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్..

FRI Dehradun Recruitment 2022: ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Fri Dehradun
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 24, 2022 | 4:57 PM

Forest Research Institute Dehradun Recruitment 2022: ఐసీఎఫ్‌ఆర్‌ఈకి చెందిన డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (FRI).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 9

పోస్టులు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.17,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు, టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: బోర్డ్‌ రూమ్‌, ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌.

ఇంటర్వ్యూ తేదీ: 2022, ఏప్రిల్‌ 4, 5.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NLC India Limited Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్‌! ఎన్ఎల్సీ ఇండియాలో 300 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు..దరఖాస్తు ఇలా..