NLC India Limited Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఎన్ఎల్సీ ఇండియాలో 300 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు..
భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC).. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Graduate Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి..
NLC India Limited Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC).. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Graduate Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 300
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.
ఖాళీల వివరాలు: మెకానికల్-117, ఎలక్ట్రికల్-87, సివిల్-28, మైనింగ్-38, జియాలజీ-6, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-5, కెమికల్-3, కంప్యూటర్-12, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్-4
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 40,000ల నుంచి రూ.66,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/మైనింగ్/జియాలజీ/కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఐటీ) బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: