NHPC JE exam date 2022: ఎన్‌హెచ్‌పీసీ జూనియర్ ఇంజనీర్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC Limited) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను బుధవారం (మార్చి 23) విడుదల చేసింది..
NHPC JE admit card 2022 Download: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC Limited) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను బుధవారం (మార్చి 23) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nhpcindia.com నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, పాంజీ, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లాలలో ఎన్‌హెచ్‌పీసీ పరీక్ష జరగనుంది. మూడు గంటలపాటు ఈ పరీక్ష జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ (సివిల్) పరీక్ష ఏప్రిల్ 4న, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పరీక్ష ఏప్రిల్ 5న, అలాగే జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) పరీక్ష ఏప్రిల్ 6న జరగనున్నాయి. కాగా మొత్తం 133 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకిగానూ ఎన్‌హెచ్‌పీసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోటీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
NHPC JE Admit Card 2022 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nhpcindia.comను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చెయ్యాలి.
- తర్వాత Link to download Admit Card w.r.t. Advt. No. NH/Rectt/05/2021 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- తగిర ఆధారాలతో లాడిన్ అవ్వాలి.
- వెంటనే అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- సేవ్ చేసుకుని, ప్రింట్ఔట్ తీసుకోవాలి.
Also Read: