Virata Parvam: విరాటపర్వం నేరుగా ఓటీటీలో విడుదల కానుందా.. భారీ డీల్‌కు చిత్ర యూనిట్ ఓకే చెబుతుందా.?
Virata Parvam: రానా (Rana), సాయిపల్లవి (SaiPallavi) జంటగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. 'నీది నాది ఒకే కథ' సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా..
Virata Parvam: రానా (Rana), సాయిపల్లవి (SaiPallavi) జంటగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలకు కాస్త బ్రేక్ పడింది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
దీనికి కారణం ఈ సినిమా విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడమే. షూటింగ్ పూర్తయి ఇన్ని రోజులు గడుస్తోన్నా ఇప్పటికీ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడంతో విరాపటర్వం ఓటీటీలోనే రానుందా అన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. అంతేకాకుండా తాజా సమాచారం ప్రకారం ఓ బడా ఓటీటీ సంస్థ విరాట పర్వం సినిమా కోసం భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. 50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.
దీంతో చిత్ర యూనిట్ ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తం రూ. 50 కోట్లకుగాను రూ. 41 కోట్లు డిజిటల్ రిలీజ్ కోసం, రూ. 9 కోట్లు శాటిలైజ్ హక్కులకు చెల్లించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నాడు. సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు.
RRR Movie Release Live: జాతర మొదలైంది.. ఆర్ఆర్ఆర్ థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం..
Tears: ఆనంద భాష్పాలు ఎందుకు వస్తాయో తెలుసా.. వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..